దుమ్ము లేపిన స్టాక్.. దశ తిప్పేసింది
రైల్వే స్టాక్స్ ఇటీవలి కాలంలో బాగా రాణిస్తున్నాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టినవారు పండగ చేసుకుంటున్నారు. భారతీయ రైల్వేకు అనుసంధానంగా ఉన్న ఒక రైల్వే స్టాక్ గత మూడు సంవత్సరాల్లో పెట్టుబడిదారులను మిలియనీర్లను చేసింది. 2020 మార్చి నుంచి చూస్తే ఏకంగా 4700 శాతానికిపైగా రిటర్న్స్ అందించింది. అది ఏ కంపెనీ అంటే కే అండ్ ఆర్ రైల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ షేరు.
కొద్దిరోజులుగా ఈ స్టాక్ సూపర్ లాభాలు ఇస్తోంది. వరుసగా అప్పర్ సర్క్యూట్లు కొడుతోంది. రైల్వే కన్‌స్ట్రక్షన్ రంగానికి చెందిన ఈ కంపెనీ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, మానుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో సేవలందిస్తోంది. షేరు ధర రూ.734.70 వద్ద స్థిరపడింది. 5 రోజుల్లో ఏకంగా 27 శాతానికిపైగా పెరిగింది. ఒక్కో షేరుపై రూ. 157 పెరిగింది. 6 నెలల్లో స్టెల్లార్స్ రిటర్న్స్ అందించడంతోపాటు 130 శాతానికిపైగా లాభాలు అందించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.41 ట్రిలియన్ కోట్లుగా ఉంది.

ఈ స్టాక్ గత రికార్డును చెరిపేస్తూ 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఎవరూ ఊహించని విధంగా గత మూడు సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్స్ అందించింది. 2020, మార్చి 20న ఈ కంపెనీ షేరు ధర రూ.15.17గా ఉండేది. ఇప్పుడు చూస్తే రూ. 734.70 వద్ద ఉంది. మూడేళ్ల కిందట ఇందులో పెట్టుబడి వారికి ఇప్పుడు లక్షల్లో లాభం వచ్చింది. మూడేళ్లలో 4700 శాతానికిపైగా రిటర్న్స్ ఇచ్చిన ఈ స్టాక్ గత ఏడాది వ్యవధిలో కూడా లక్షను రూ.25 లక్షలు చేయడం విశేషం.
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అంటే జనవరి నుంచి చూస్తే 1000 శాతానికిపైగా పెరిగింది. రానున్న రోజుల్లోనూ మరింత పెరిగే సూచనలు కనపడుతున్నాయంటున్నారు నిపుణులు. రైల్వే కన్‌స్ట్రక్షన్ రంగంలో ఇది లీడింగ్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications