KTM ఆరెంజ్ పులి వస్తోంది.. మార్కెట్ కు దడ పుట్టిస్తున్న RC 160
స్పీడ్ అంటే కేటీఎం(KTM).. స్టైల్ అంటే కేటీఎం... అగ్రెషన్ అంటే కేటీఎం!. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై కుర్రకారును ఊగించిన యూత్ ఐకాన్ కేటీఎం, ఈ మధ్యలో కాస్త సైలెంట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఫుల్ థ్రోటిల్ మోడ్‌లోకి వచ్చేసింది. ఇప్పటికే డ్యూక్ (Duke) 160తో మార్కెట్‌ని షేక్ చేసిన కేటీఎం, ఇప్పుడు ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ సెగ్మెంట్‌లో తన బేబీ KTM RC 160ని దింపుతోంది. ఈ బైక్ ఎంట్రీతో స్పోర్ట్స్ బైక్స్ మార్కెట్ టెన్షన్ మొదలైనట్టే అని ఆటో వర్గాల్లో టాక్ నడుస్తోంది.
లుక్ చూస్తేనే లవ్ లో పడేసే రేంజ్ కేటీఎం సొంతం. చాలా మంది కుర్రాళ్కు ఫస్ట్ సైట్ క్రష్!. కొనే అంత బడ్జెట్ లేకపోయినా.. ఒక్కసారైనా డ్రైవ్ చేయాలని తహతహలాడిన వారు చాలా మంది. ఇప్పుడు తాజాగా వస్తున్న బేబీ RC 160 డిజైన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా. ఒక్క మాటలో దీని గురించి చెప్పాల్సి వస్తే దీన్ని ప్యూర్ రేష్ మిషన్ అనొచ్చు. పూర్తిగా తన పెద్ద అన్న RC 200 DNAతోనే వస్తోంది. షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్, అగ్రెసివ్ ఫుల్ ఫెయిరింగ్, స్టైలిష్ DRLs... రోడ్డుపై ఇది వెళ్తుంటే ఎవరైనా మనవైపు ఓ లుక్కేయాల్సిందే. మస్కులర్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు, స్పోర్టీ ఎగ్జాస్ట్... మొత్తం మీద ఆల్ టైం సూపర్ బైక్ గా కనిపిస్తుంది. ఇక కలర్ వేరియంట్లు చూస్తే యూత్‌కు ఫుల్ మాస్ ట్రీటే. ఆరెంజ్, బ్లాక్, బ్లూ షేడ్స్‌లో కొత్త గ్రాఫిక్స్ డిజైన్ తో రొడ్డెక్కబోతుంది
స్పీడ్ + కంట్రోల్ = KTM మ్యాజిక్
RC 160లో 164.2cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9,500 RPM వద్ద 19 bhp పవర్, 7,500 RPM వద్ద 15.5 Nm టార్క్ని పంచుతుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, ట్రాఫిక్‌లోనూ చురుకుగా, హైవే మీద అయితే ఫుల్ ఫన్ మోడ్‌లో దూసుకుపోతుంది.

కార్నర్‌లో రాజు... హ్యాండ్లింగ్‌లో బాస్
KTM అంటే హ్యాండ్లింగ్‌లో నెంబర్ వన్. RC 160ను కూడా స్ప్లిట్ ట్రెల్లిస్ ఫ్రేమ్పై కట్టారు. తక్కువ బరువు, బెస్ట్ బ్యాలెన్స్‌తో కార్నర్లలో ఇది అసలు తగ్గదు. ముందువైపు WP Apex USD ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ అంటే రైడింగ్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవల్. పైగా SuperMoto ABS, ఫుల్ LED లైటింగ్, LCD క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో బైక్‌ను ఒక స్టెప్ అప్ చేస్తాయి.
ధర వింటే షాక్... పోటీ చూస్తే టెన్షన్
ప్రస్తుతం Duke 160 ధర సుమారు రూ.1.70 లక్షలు కాగా, కొత్త RC 160 ధర రూ.1.80 లక్షల - రూ.1.95 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఈ ప్రైస్ ట్యాగ్‌తో యమహా R15 V4, పల్సర్ RS 200, జిక్సర్ SF 150, కరిష్మా XMR 210 లాంటి బైక్‌లకు డైరెక్ట్ ఫైట్ ఖాయం. ముఖ్యంగా R15 కొనాలని ప్లాన్ చేస్తున్న యూత్ ఇప్పుడు "ఒక్కసారి KTM RC 160 కూడా చూద్దామా?" అనడం పక్కా.
న్యూ ఇయర్ గిఫ్ట్!
తక్కువ ధరలో ప్రీమియం లుక్, స్పోర్టీ రైడ్, KTM బ్రాండ్ వాల్యూ కావాలంటే RC 160 పర్ఫెక్ట్ ప్యాకేజ్. కాలేజ్ రైడ్స్, వీకెండ్ ఎస్కేప్స్, షార్ట్ టూరింగ్... అన్నింటికీ సెట్. 2026 కొత్త ఏడాది కానుకగా జనవరి చివరికి షోరూమ్‌లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications