Learjet 45: వీఐపీలకు ఇష్టమైన ప్రైవేట్ జెట్, చిన్న రన్‌వే పై కూడా ల్యాండింగ్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తోన్న విమానానికి ప్రమాదం సంభవించింది. క్రాష్ ల్యాండింగ్ కు గురైంది. మహారాష్ట్రలోని బారామతిలో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు ప్రాణాలు కొల్పోయారు. అయితే ఈ క్రమంలోనే అజిత్ పవార్ ప్రయాణించిన లియర్‌జెట్ 45 (Learjet 45) గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ ప్రైవేట్ జెట్ గురించి పూర్తి వివరాలు..
డిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ చార్టర్ కంపెనీ వీఎస్ఆర్ ఏవియేషన్ (VSR Aviation / VSR Ventures Pvt. Ltd.)కు చెందిన లియర్‌జెట్ 45 (Learjet 45) విమానం దేశీయ ప్రైవేట్ విమానయాన రంగంలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది. కార్పొరేట్ ప్రయాణాలు, వీఐపీ చార్టర్ సేవలు, అత్యవసర అవసరాల కోసం ఈ తరహా జెట్‌లను వినియోగిస్తున్నారు. లియర్‌జెట్ 45 అనేది కెనడాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ (Bombardier Aerospace) రూపొందించిన మిడ్-సైజ్ బిజినెస్ జెట్. 1990ల చివర్లో మార్కెట్లోకి వచ్చిన ఈ విమానం ఇప్పటికీ ప్రైవేట్ చార్టర్ రంగంలో విస్తృతంగా వినియోగంలో ఉంది.

Learjet 45.. గంటకు 850 కి.మీ స్పీడ్..
ఈ విమానం గంటకు సుమారు 850 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. గరిష్ఠంగా 51,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. ఒకేసారి 8 నుంచి 9 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అనుకూలంగా డిజైన్ చేయబడింది. ఇంధనం నింపకుండా సుమారు 3,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యం ఉంది.
లియర్‌జెట్ 45 లోపలి క్యాబిన్‌ను ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. విశాలమైన లెదర్ సీట్లు, తక్కువ శబ్దంతో కూడిన క్యాబిన్, పని చేసుకునేందుకు అనువైన టేబుల్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ కారణంగా కార్పొరేట్ ప్రయాణాలకు ఇది అనువైన విమానంగా గుర్తింపు పొందింది. వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రైవేట్ చార్టర్ సేవలు అందిస్తోంది. సంస్థ ఫ్లీట్‌లో లియర్‌జెట్ 45, లియర్‌జెట్ 45XR వంటి బిజినెస్ జెట్‌లు ఉన్నాయి. ఈ విమానాలను రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల అధినేతలు, అత్యవసర ప్రయాణ అవసరాలున్న వ్యక్తులు వినియోగిస్తుంటారు.
ఫీచర్లు..
Learjet 45 ను Bombardier అనే ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ రూపొందించింది. ఈ విమానం డ్యూయల్ ఇంజిన్ (రెండు ఇంజిన్లు) కలిగి ఉంటుంది. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా సేఫ్‌గా ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఉంది. అంతర్జాతీయ FAA, EASA, DGCA భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫై అయింది. డిజైన్ పరంగా ఇది హై-సేఫ్టీ క్లాస్ జెట్. టెక్నాలజీ & సేఫ్టీ సిస్టమ్స్ పరంగా చూస్తే.. Learjet 45లో ఆధునిక అవియానిక్స్ సిస్టమ్ ఉంది. ఆటోపైలట్ మోడ్, గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్ (GPWS), వెదర్ రాడార్, అత్యవసర పరిస్థితుల్లో ఆటో అలర్ట్స్ వంటి అధునాతన ఫీచర్లతో ఇవి పైలట్‌కు ముందే ప్రమాద సూచనలు ఇస్తాయి.
2003 లో తొలి ప్రమాదం..
వీఎస్ఆర్ సంస్థకు చెందిన కొన్ని లియర్‌జెట్ విమానాలు గతంలో వార్తల్లో నిలిచాయి. 2023లో ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో వీఎస్ఆర్ సంస్థకు చెందిన ఒక లియర్‌జెట్ 45 విమానం రన్‌వే నుంచి జారి ప్రమాదానికి గురైంది. అయితే ఆ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం సంబంధిత అధికార సంస్థలు విచారణ చేపట్టాయి.
ప్రైవేట్ చార్టర్ విమానయానంలో వేగం, విశ్వసనీయత, తక్కువ సమయంలో గమ్యం చేరుకునే సామర్థ్యం కీలకంగా మారడంతో లియర్‌జెట్ 45 లాంటి విమానాలకు డిమాండ్ కొనసాగుతోంది. చిన్న రన్‌వేల్లో కూడా ల్యాండ్ అయ్యే సామర్థ్యం ఉండటంతో ఈ జెట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
మొత్తంగా చూస్తే, డిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు చెందిన లియర్‌జెట్ 45 విమానం దేశీయ ప్రైవేట్ విమానయాన రంగంలో ఒక కీలక భాగంగా కొనసాగుతోంది. కార్పొరేట్, వీఐపీ ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఈ తరహా జెట్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications