హైదరాబాద్‌వాసులకు శుభవార్త: ఇంటివద్ద ఏమైనా మరిచారా, వెంటనే డాక్యుమెంట్స్ డెలివరీ చేయాలా..?
హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో 10డెలివరీ.కామ్ సోమవారం నాడు తన సేవలను ప్రారంభించింది. ఇంటర్ సిటీ కొరియర్ (హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో) మరియు పార్సిల్ డెలివరీ సేవలలో వేగవంతమైన డెలివరీ, పికప్స్ తమ లక్ష్యమని 10డెలివరీ.కామ్ ను ప్రమోట్ చేస్తున్న యాడ్‌నిగమ్ యాజమాన్యం తెలిపింది.
యాడ్ నిగమ్ హైదరాబాదులో లోకల్ మార్కెట్ సేవలను అందిస్తోంది. స్థానిక వ్యాపారులు, రిటైలర్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేసుకునేందుకు యాడ్ నిగమ్ ఉపయోగపడుతోంది. ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు ఇది అనుకూలంగా ఉంది. ఈ యాడ్ నిగమ్ సంస్థనే 10డెలివరీ.కామ్‌ను ప్రమోట్ చేస్తోంది.

వెబ్ పోర్టల్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు. ఇది జంట నగరాల్లోని వ్యాపారస్తులకు, ట్రేడర్లకు ఉపయోగకరంగా ఉంటుందని, తేలికపాటి పార్సిళ్లను తక్కువ ధరలోనే డెలివరీ చేస్తామని యాడ్ నిగమ్ వ్యవస్థాపకులు, సీఈవో కేశిరెడ్డి రాజిరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
డెలివరీ ఛార్జీలు డాక్యుమెంట్స్ కిలోకు రూ.25, రెండు కిలోలోపు వస్తువులకు రూ.50 చొప్పున ఛార్జీలు ఉంటాయని చెప్పారు. దూరాన్ని బట్టి ఈ మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పారు. తొలి ఆర్డర్ రూ.10కే చేస్తామని చెప్పారు. ఇంటివద్ద మరిచిపోయిన తాళాలు, వాలెట్లలాంటివి కూడా కావాల్సిన చోటుకు తెచ్చిస్తామని, ఏదైనా అదే రోజు డెలివరీ ఉంటుందన్నారు.
వెబ్ పోర్టల్ ద్వారా అయితే 10delivery.com వాట్సాప్ ద్వారా అయితే 9441289333 ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఇది మొబైల్ ఫ్రెండ్లీ పోర్టల్. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ సేవలు ప్రారంభమవుతాయని రాజిరెడ్డి తెలిపారు. ఇది ఉద్యోగులకు, చిన్న వ్యాపారస్తులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
సంప్రదాయక కొరియర్ సంస్థల సేవలు పట్టణ ప్రజల అవసరాలకు భిన్నంగా ఉంటాయని చెప్పారు. వివిధ ఆఫీసులలో తక్షణ డాక్యుమెంట్ల పంపిణీ, మరిచిపోయిన వస్తువులను అందించడం వంటి సేవలు ఉంటాయని తెలిపారు.
వేగవంతమైన డెలివరీ, ఉచిత పికప్స్.. ముఖ్యంగా పాకెట్ ఫ్రెండ్లీ టారిఫ్స్ ( సరసమైన ధరలు) ఇది 10డెలివరీ.కామ్ అని చెప్పారు. త్వరలో కార్పోరేట్ సంస్థలు, బల్క్ బుకింగ్‌లపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications