ఇదేం క్రేజ్ గురూ.. 135 సెకండ్స్‌లో 999 కార్లు సేల్ అవుట్ !
ప్రముఖ దిగ్గజ సంస్థ మహీంద్రా మరోసారి సెన్సేషన్ సృష్టించింది. కేవలం 135 సెకన్లలో 999 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేసి రికార్డులు తిరగరాసింది. దీంతో ఈ వ్యవహారం బిజినెస్ సర్కిల్స్ లో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహీంద్రా సంస్థ ఆగస్టు 14న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో BE 6 Batman Edition ప్రత్యేకంగా విడుదల చేసింది. ప్రారంభంలో 300 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ.. వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ కారణంగా మొత్తం 999కి కార్లను పెంచింది. అయినా కానీ ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 135 సెకన్లలో 999 యూనిట్లు సేల్ అవుట్ అయ్యాయి.

ఈ ప్రత్యేక ఎడిషన్ Pack Three వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో 79 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడింది, ఒక్క చార్జ్‌తో 682 కి.మీ ARAI సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. రియర్ యాక్సిల్‌లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 286 hp పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ధర & ప్రీమియం ఫీచర్లు
Mahindra BE 6 Batman Edition ధర రూ.27.79 లక్షలు. ఈ స్పెషల్ ఎడిషన్ పూర్తి బ్యాట్‌మాన్ థీమ్ లో రూపొందించబడింది. సాటిన్ బ్లాక్ ఫినిష్, కస్టమ్ బ్యాట్‌మాన్ డీకల్స్, టైల్గేట్‌లో డార్క్ నైట్ ఎంబ్లమ్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. ఫెండర్, బంపర్, రివర్స్ ల్యాంప్‌ల వద్ద కూడా బ్యాట్‌మాన్ లోగో కనిపిస్తుంది. ఇంటీరియర్ పూర్తిగా గోతమ్ థీమ్ లోనే తీర్చిదిద్దబడింది. ఇన్ఫినిటీ రూఫ్‌పై డార్క్ నైట్ ట్రైలజీ ఎంబ్లమ్, బ్యాట్‌మాన్ ప్రొజెక్షన్ ఉన్న నైట్ ట్రైల్ కార్పెట్ ప్లాంక్స్, డాష్‌బోర్డ్‌పై బ్రష్డ్ ఆల్కమీ ప్లాక్ ప్రత్యేకతను పెంచుతున్నాయి.
ఈ వేరియంట్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో వస్తుంది, అలాగే 20-అంగుళాల వీల్స్ ఆప్షన్ కూడా ఉంది. వీల్ హబ్ క్యాప్స్, బ్రేకులు, స్ప్రింగ్స్ పై Alchemy Gold ఫినిష్ కారుకు ప్రత్యేకతను ఇస్తుంది. అలానే డ్రైవర్ ఏరియాలో ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ చార్కోల్ లెదర్‌తో, గోల్డెన్ హాలో ఫినిష్‌తో అందించబడింది. సీట్లు స్వేడ్-లెదర్ తో గోల్డెన్ హైలైట్స్, డార్క్ నైట్ ట్రైలజీ బ్యాడ్జ్ తో మెరిసిపోతాయి. స్టీరింగ్ వీల్, కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీ ఫాబ్ అన్ని బ్యాట్‌మాన్ లోగో తో ప్రత్యేకత పెరుగుతుంది.
మహీంద్రా BE 6 Batman Edition ఒక ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత ప్రత్యేక & ఆకర్షణీయమైన వేరియంట్గా నిలుస్తోంది. పవర్, రేంజ్, డిజైన్, ఇంటీరియర్ అన్ని ఫీచర్లు కలిపి ఈ కారును మరింత ఆకట్టుకునే వాహనంగా మార్చాయి. బ్యాట్‌మాన్ థీమ్ ఫీచర్స్, సులభంగా డ్రైవ్ చేసే పవర్ ఫుల్ మోటార్, పెద్ద రేంజ్ కలిగిన బ్యాటరీ తో, ఇది ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో హాట్ కేక్ లాగా అమ్ముడవుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications