Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహీంద్రా థార్ 'స్టార్' అదిరింది.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Mahindra Star Roxx: మహీంద్రా అండ్ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ 'థార్ రాక్స్'లో సరికొత్త 'స్టార్ ఎడిషన్'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అదిరిపోయే లుక్, అత్యాధునిక ఫీచర్లతో రూపొందించబడిన ఈ కొత్త ఎడిషన్, స్టైలిష్‌గా ఉంటూనే ధాటిగా ప్రయాణించే పర్ఫార్మెన్స్‌ను కోరుకునే వాహన ప్రియుల కోసం తీసుకువచ్చారు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 16.85 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. కేవలం ధర మాత్రమే కాకుండా, ఈ ఎడిషన్ లోపల, వెలుపల అనేక డిజైన్ మార్పులను మహీంద్రా చేపట్టింది.

మూడు వేరియంట్ల ధరలు ఇలా..

ఈ కొత్త థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మాన్యువల్ RWD వేరియంట్ ధర రూ. 16.85 లక్షలు కాగా.. పెట్రోల్ ఆటోమేటిక్ RWD వేరియంట్ రూ. 17.85 లక్షలు, డీజిల్ మాన్యువల్ RWD వేరియంట్ రూ. 18.35 లక్షలకు లభిస్తున్నాయి. రంగుల విషయానికొస్తే, ఇందులో 'సిట్రిన్ ఎల్లో' అనే సరికొత్త స్పోర్టీ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. ఇది కాకుండా వినియోగదారులు టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, స్టీల్త్ బ్లాక్ వంటి రంగులను కూడా ఎంచుకోవచ్చు.

mahindra thar roxx star edition Launched at Rs 16 85 Lakh Check Price Features and Colors Details

విలాసవంతమైన లుక్

వాహనం బయటి వైపు డిజైన్ పరంగా పియానో బ్లాక్ ఫినిష్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, అదే ఫినిష్‌తో ఉన్న అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక లోపలి భాగంలో క్యాబిన్ మరింత ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా సూయెడ్ టచ్‌తో కూడిన ఆల్-బ్లాక్ లెదరెట్ సీట్లను అమర్చారు. ఈ డీప్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ కారుకు మరింత విలాసవంతమైన లుక్‌ను జోడిస్తుంది.

ఫీచర్ల పరంగా చూస్తే..

ఇందులో 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అంతే పరిమాణం ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, 9 స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు కల్పిస్తున్నారు. భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ కారుకు భారత్ NCAP లో 5-స్టార్ రేటింగ్ లభించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్రినాక్స్ కనెక్టెడ్ టెక్నాలజీ, SOS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+