కుప్పకూలిన మార్కెట్లు, 5 నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి: కారణాలివే
ముంబై: మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్‌తో రూపాయి విలువ కారణంగా మార్కెట్ భారీగా పడిపోయింది. వరుస నష్టాల నుంచి బుధవారం కాస్త కోలుకున్నప్పటికీ ఈ రోజు దలాల్ స్ట్రీట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది.
ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా రూపాయి గురువారం మరింత పతనమైంది. డాలరుతో రూపాయి విలువ మారకం 24 పైసలు క్షీణించి రూ.74.45 వద్ద ఉంది. ఇది లైఫ్ టైమ్ హయ్యెస్ట్.

ఆసియా మార్కెట్లు, అమెరికా మార్కెట్లు నష్టపోవడం కూడా మన మార్కెట్ల పైన బాగా ప్రభావం చూపింది. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 959 పాయింట్లు నష్టపోయి 33,801.82 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 296.55 పాయింట్లు నష్టపోయి 10,163.55 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. గురువారం కేవలం ఐదు నిమిషాల్లోనే సుమారు రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
గత ఎనిమిది నెలల్లో ఇది అతిపెద్ద కుదుపుగా చెబుతున్నారు. మార్కెట్లు ఆ తర్వాత కొంత రికవరీ అయినప్పటికీ ఆశించినంతగా లేదు. ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్ తదితర కంపెనీ షేర్లు లాభాల్లో ఉండగా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, వొడాఫోన్, ఐడియా, యాక్సెస్ బ్యాంక్ తదితర షేర్లు నష్టపోయాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications