సెన్సెక్స్ 331, నిఫ్టీ 81 పాయింట్లు...భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
రెండ్రోజుల క్రితం నష్టాల బాటలో ముగిసిన భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే మార్కెట్లు మంచి లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా మెటల్ రంగం, ఎనర్జీ రంగాలు లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ నిఫ్టీ రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 331 పాయింట్ల లాభాలతో ముగియగా నిఫ్టీ 81 పాయింట్ల ప్రాఫిట్‌తో క్లోజ్ అయ్యాయి. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.1శాతం పెరుగుదలతో ముగియగా... బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతంతో ముగిసింది.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ సానుకూలతలు కూడా తోడవడంతో బ్యాంకింగ్ ఇతర రంగాల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు లాభాల బాటను కొనసాగించాయి. ఇందులో భాగంగానే సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 331 పాయింట్లు పెరిగి 38,277కు ఎగబాకింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 11,552కు చేరుకుంది.

ఈరోజు భారీ లాభాల్లో దూసుకెళ్లినవి ఇవే:
హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (18.63%), వెల్స్ పన్ కార్ప్ (11.46%), పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (7.96%), జిందాల్ సా లిమిటెడ్ (7.22%), ఎల్ అండ్ టీ (6.74%).
నష్టాలు చవిచూసిన కంపెనీలు
గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (-5.92%), ఫెడరల్ బ్యాంక్ (-5.62%), గ్రాఫైట్ ఇండియా (-4.95%), టీటీకే ప్రిస్టేజ్ (-4.22%), తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్స్ (-3.84%).
ఇక ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. హ్యాంగ్‌సెంగ్ 139శాతం పెరుగుదల నమోదు చేయగా... నిక్కీ 0.32 శాతంతో పడిపోయింది. షాంగై కంపోజిట్ 1.09శాతం లాభాలు నమోదు చేసింది. యూరోపియన్ మార్కెట్లు కూడా మంచి ఫలితాలే ఇచ్చాయి.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications