మారుతి e-Vitara ధర లీక్?.. ఆ స్క్రీన్ షాట్ నిజమేనా?

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి నుంచి రాబోతున్న తొలి ఎలక్ట్రిక్ కారు e-Vitara కోసం వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కారు ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇప్పటికే వెల్లడైనప్పటికీ.. ధర విషయంలో కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ కారు ధరలకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ధర ఎంత?
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో ఒక యూజర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం.. మారుతి e-Vitara ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.79 లక్షలుగా ఉంది. ఇది మారుతి నెక్సా (Nexa) అధికారిక వెబ్‌సైట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌గా ప్రచారం జరుగుతోంది.

Maruti e Vitara Price Leaked Viral Rs 24 79 Lakh Screenshot Reality Check and Specifications Revealed

ఈ వార్తల్లో నిజమెంత?
ప్రస్తుతానికి మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా ఈ ధర కనిపించడం లేదు. అది వెబ్‌సైట్‌లో జరిగిన ఏదైనా సాంకేతిక లోపం కావచ్చు లేదా ఎవరో ఎడిట్ చేసిన ఫోటో కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా కొత్త కార్లను వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసేటప్పుడు డమ్మీ ధరలను ఉంచుతుంటారు. పొరపాటున అది లైవ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

ఒకవేళ రూ.24.79 లక్షలు నిజమైతే?
ఒకవేళ ఈ ధర గనుక నిజమైతే.. మారుతి e-Vitara తన విభాగంలోని ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కంటే భారీ ధరతో ఉన్నట్లే. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ మోడళ్ల కంటే ఇది సుమారు రూ. 6 లక్షల వరకు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇంత భారీ ధరతో మార్కెట్లో పోటీని తట్టుకోవడం మారుతికి సవాలుగా మారవచ్చు.

మారుతి e-Vitara ప్రత్యేకతలు ఇవే:
ఈ కారును కంపెనీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో తీసుకువస్తోంది. 49kWh బ్యాటరీ.. ఇది బేస్ వేరియంట్ (Delta)లో లభించనుంది. 61kWh బ్యాటరీ.. ఇది టాప్ వేరియంట్లు (Zeta, Alpha)లో లభించనుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 543 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారును గుజరాత్‌లోని ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాలకు ఈ కారును ఎగుమతి చేయాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది.

మారుతి e-Vitara ఈ నెలలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడే ఈ కారు అసలు ధరలు ఎంతో మనకు తెలుస్తుంది. అంతవరకు వైరల్ అవుతున్న వార్తలను పూర్తిగా నమ్మలేం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+