రూ.5.99 లక్షలకే లగ్జరీ కారు.. మైలేజ్‌తో మార్కెట్ షేక్!

మారుతి సుజుకి బలేనో మరోసారి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన సత్తా చాటింది. కేవలం ధర మాత్రమే కాకుండా అద్భుతమైన మైలేజ్, లగ్జరీ ఫీచర్లలో 2025 డిసెంబర్ నెలకు సంబంధించి దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానానికి చేరుకుంది. భారతీయ మధ్యతరగతి కుటుంబాల ఫేవరెట్ కారు మారుతి సుజుకి బలేనో డిసెంబర్ 2025లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఓ వైపు ఎస్‌యూవీల హవా నడుస్తున్నా, ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ తన సేల్స్‌తో దిగ్గజ కార్లను కూడా వెనక్కి నెట్టింది.

అమ్మకాల్లో నంబర్ వన్
గత డిసెంబర్ నెలలో బలేనో ఏకంగా 22,108 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. మారుతి ఫ్రాంక్స్ (20,700 యూనిట్లు), టాటా నెక్సాన్ (19,400 యూనిట్లు) వంటి పాపులర్ మోడళ్లను కూడా దాటేసి నంబర్ 1 కారుగా నిలిచింది. గత ఐదు నెలలుగా నెలకు సగటున 13,000 యూనిట్లు అమ్ముడవుతుండగా, డిసెంబర్‌లో ఒక్కసారిగా ఈ స్థాయిలో పెరగడం విశేషం.

Maruti Suzuki Baleno Shakes Market Luxury Car at Rs 5 99 Lakh with Stunning Mileage

ధర తగ్గడానికి కారణం ఏమిటి?
సెప్టెంబర్ 2025 నుండి అమలులోకి వచ్చిన GST 2.0 సంస్కరణల వల్ల చిన్న కార్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై ప్రభుత్వం పన్ను తగ్గించింది. దీనివల్ల బలేనో ధర సుమారు రూ. 86,000 వరకు తగ్గింది. ప్రస్తుతం ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అన్ని హంగులు ఉన్న ఆల్ఫా ఏఎంటీ వెర్షన్(టాప్ ఎండ్ మోడల్) రూ. 9.10 లక్షల లోపే లభిస్తోంది.

మైలేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
మధ్యతరగతి ప్రజలకు అత్యంత ముఖ్యమైన మైలేజ్ విషయంలో బలేనో తిరుగులేని రేటింగ్‌ను అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 22.94 కి.మీ ఇస్తోంది. సీఎన్జీ వేరియంట్ ఏకంగా 30.61 కి.మీ ఇస్తోంది. దాదాపు ఒక సాధారణ బైక్ ఇచ్చే మైలేజీని ఈ కారు అందిస్తోంది. పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడేవారికి ఇది వరం లాంటిదని చెప్పవచ్చు.

లగ్జరీ, సేఫ్టీ ఫీచర్లు
తక్కువ ధరకే బలేనోలో ఎన్నో హై-ఎండ్ ఫీచర్లను మారుతి చేర్చింది. 360-డిగ్రీ కెమెరాను ఈ కారులో మారుతి అమర్చింది. ఇరుకైన సందుల్లో పార్కింగ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. డ్రైవర్ రోడ్డు మీదే దృష్టి సారించేలా స్పీడ్, నావిగేషన్ వివరాలను విండ్‌షీల్డ్ పైనే చూసేలా హెడ్స్-అప్ డిస్ప్లేను ఏర్పాటు చేసింది. 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అలెక్సా సదుపాయం ఉంది. భద్రత పరంగా అనేక సదుపాయాలను కల్పించింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (Electronic Stability Program), హిల్-హోల్డ్ అసిస్ట్, భారత్ NCAPలో మెరుగైన రేటింగ్ దీనికి లభించాయి.

స్టైలిష్ లుక్ - స్పేషియస్ ఇంటీరియర్
ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు లగ్జరీ లుక్ ఇస్తుంది. లోపల 318 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం వల్ల కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసేటప్పుడు లగేజీ సర్దుకోవడం సులభం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+