పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్న పసిడి రేట్లు.. అనూహ్యంగా
దేశంలో నేడు బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు వీటి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా క్షీణించాయి. దీంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గి, సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు మదుపర్లు మళ్లీ మొగ్గు చూపారు. యుఎస్ డాలర్ పతనం కావడం కూడా వీటి కొనుగోళ్లకు ఊతం ఇచ్చింది.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు బంగారం కాంట్రాక్ట్ దాదాపు 0.62 శాతం మేర పెరిగి 10 గ్రాములకు రూ.1,43,990కి చేరింది. సెప్టెంబర్ డెలివరీ వెండి ఫ్యూచర్స్ ఒక శాతం పెరిగి, కిలోకు రూ.2,24,359 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 1.4 శాతం లాభపడి ఔన్సుకు 4,110.56 డాలర్ల వద్ద నూతన గరిష్ఠాన్ని తాకింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ సైతం ఒక శాతం మేర పుంజుకుని 4,112.10 డాలర్ల వద్ద ట్రేడ్ కావడం జోష్ నింపింది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,070 గా నమోదు కాగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,990 వద్ద స్థిరపడింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గరిష్ఠంగా రూ.1,44,920, 22 క్యారెట్లు బంగారం రూ.1,33,700 వద్ద నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,700, 24 క్యారెట్లు రూ.1,45,860, వెండి కిలో రూ.2,39,900 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.1,32,990, 24 క్యారెట్లు రూ.1,45,080, వెండి కిలో రూ.2,39,900, బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ. 1,33,700, 24 క్యారెట్లు రూ.1,45,890, వెండి కిలో రూ.2,39,900 వద్ద కొనసాగుతున్నాయి. యుఎస్ డాలర్ ఇండెక్స్ 0.30 శాతానికి పైగా పడిపోవడంతో పసిడి, వెండికి డిమాండ్ పెరిగింది. స్పాట్ సిల్వర్ 2.8 శాతం పెరిగి 59.81 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం సైతం 2.6 శాతం లాభంతో 1,629.15 డాలర్ల వద్ద స్థిరపడింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,509, 22 క్యారెట్లు - రూ. 13,300, 18 క్యారెట్లు - రూ. 11,115
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,493, 22 క్యారెట్లు- రూ. 13,285, 18 క్యారెట్లు - రూ. 10,870












Click it and Unblock the Notifications