పసిడి ధరల్లో పురోగమనం: లాభాల జోష్.. అయినా నిలుస్తాయా?

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పసిడి ధరలపై పడుతోంది. మే నెల తర్వాత మొదటిసారిగా భారీ స్థాయిలో లాభాలను నమోదు చేసినా... అవేవీ కూడా నిలకడగా ఉండేలా కనిపించట్లేదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో తదుపరి నిర్ణయాలపై ఇన్వెస్టర్లలో నెలకొన్న అంచనాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

దీని ప్రభావంతో గత వారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ధరలు సుమారు 3.1 శాతం మేర పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అందించిన సమాచారం ప్రకారం, నేడు బంగారం ధరలు క్రమంగా పుంజుకున్నాయి. వార ఆరంభంతో పోలిస్తే వారాంతం నాటికి మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల ధరలు గణనీయమైన మార్పును నమోదు చేశాయి.

MCX Gold and Silver Rate Update July 05 Futures Nudge Prices Hold Steady Records 1st Weekly Gain

దేశీయ కమొడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ (MCX)లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా 0.01 శాతం మేర తగ్గింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ 0.04 శాతం పెరిగాయి. దేశంలో ఒక్కో నగరంలో స్థానిక పన్నులు, రవాణా ఛార్జీల ఆధారంగా బంగారం ధరలు స్వల్పంగా మారుతుంటాయి. చెన్నైలో బంగారం ధరలు అత్యధికంగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 149,460 వరకు చేరుకుంది.

ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లో పసిడి ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 146,730, 22 క్యారెట్లు రూ. 134,500 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, దేశీయంగా కరెన్సీ మార్కెట్లలో వచ్చే మార్పుల వల్ల రానున్న రోజుల్లో కూడా ఈ పసిడి ధరల ఒడుదొడుకులు ఇలాగే కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,946, 22 క్యారెట్లు - రూ. 13,700, 18 క్యారెట్లు - రూ. 11,440

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,673, 22 క్యారెట్లు- రూ. 13,450, 18 క్యారెట్లు - రూ. 11,005

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+