బంగారం ధరలపై అంచనాలు తలకిందులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై రెండు వారాల దాడుల నిలిపివేతకు అంగీకరించడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. దీని ప్రభావం బంగారం ధరలపై విపరీతంగా పడింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,51,084 వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం నాటితో పోల్చుకుంటే 0.46 శాతం పడిపోయింది. వెండి ధర కూడా కిలో 1.52 శాతం తగ్గింది. రూ.2,36,233 వద్ద లభిస్తోంది.
ఈ ధరల పతనానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ చర్యలే కారణమని అభిప్రాయాలు ఉన్నాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య సీజ్ ఫైర్ కుదిరినప్పటికీ దీన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. లెబనాన్‌లోని హెజ్బోల్లా ఉగ్రవాద సంస్థపై దాడి చేసింది. దీంతో శాంతి చర్చలకు ఆటంకం కలిగింది. ఫలితంగా బంగారం, వెండి, ముడి చమురు ధరలు మళ్లీ మొదటికొచ్చాయి. పసిడి, వెండి రేట్లు తగ్గగా.. ముడి చమురు ధర అమాంతం ఎగబాకింది.

అంతర్జాతీయ మార్కెట్ లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. స్పాట్ బంగారం ధర ఔన్సుకు 4,270 డాలర్ల వరకు పెరిగింది. కామెక్స్ (COMEX)లో బంగారం ధర 0.5 శాతం తగ్గి 4,754.80 డాలర్లకు చేరింది. ఇంట్రాడే కనిష్ట స్థాయి 4,718.60 డాలర్లుగా నమోదైంది. స్పాట్ వెండి ధరలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఔన్సుకు 74- 74.4 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి. స్పాట్ వెండి ఔన్సుకు 73.9805 తగ్గింది. ఇంట్రాడేలో 72.8945 కనిష్టాన్ని నమోదుచేసింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,273, 22 క్యారెట్లు - రూ. 14,000, 18 క్యారెట్లు - రూ. 11,361
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,148, 22 క్యారెట్లు- రూ. 13,885, 18 క్యారెట్లు - రూ. 11,361
-
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
అక్షయ తృతీయ ఏ రోజు? ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే ఐశ్వర్యమే.. -
2,500 ఏళ్ల నాటి 'బంగారు కళ్ల' కిరీటం, దుష్టశక్తి భయంకరమైన నిజాలు! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?












Click it and Unblock the Notifications