బంగారం ధరలు రివర్స్ గేర్- షార్ప్ డ్రాప్
దేశంలో బంగారం ధరలు నేడు గణనీయంగా పడిపోయాయి. బలమైన అమెరికన్ డాలర్, లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల బలహీనత దీనికి ప్రధాన కారణాలు. ఇరాన్ యుద్ధం ప్రారంభం నుండీ పసిడి ధరలలో అస్థిరత కొనసాగుతోంది. బంగారం కొనొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం, ఆ వెంటనే వాటి దిగుమతుల పన్ను భారీగా పెంచడంతో వీటి రేట్లు భగ్గుమన్నాయి గానీ ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి.
నేడు బులియన్ మార్కెట్ లో బలమైన దిద్దుబాటు కనిపించింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, పటిష్టమైన యూఎస్ డాలర్, పెట్టుబడిదారుల భారీ లాభాల స్వీకరణతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం విలువ తగ్గింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 3,200 తగ్గి రూ. 1,62,000కి చేరింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గోల్డ్ కాంట్రాక్టులు శుక్రవారం నాటికి రూ. 1,58,450కి పడిపోయిన విషయం తెలిసిందే. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించిన వివరాల ప్రకారం క్లోజింగ్ సెషన్ 10 గ్రాముల బంగారం రూ. 1,58,210 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది జనవరి 29న ఎంసీఎక్స్ లో బంగారం ఫ్యూచర్ ట్రేడింగ్స్ 10 గ్రాములకు రూ. 1,80,779 గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత ఇది క్షీణించింది. ఈ ర్యాలీకి బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలు ఔన్స్‌కు 4,548.46 డాలర్లకు తగ్గాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,091, 22 క్యారెట్లు - రూ. 14,750, 18 క్యారెట్లు - రూ. 12,310
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,770
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,770
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,770
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,770
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,693, 22 క్యారెట్లు- రూ. 14,385, 18 క్యారెట్లు - రూ. 11,770

Click it and Unblock the Notifications