మిడిల్ క్లాస్ మెగా స్టార్: రూ.55వేలకే 70 కిలోమీటర్ల మైలేజ్.. పిచ్చెక్కించే ఫీచర్లు!
సాధారణంగా మధ్యతరగతి ప్రజలు రోజువారీ ప్రయాణ అవసరాలు తీర్చుకుంటూ తమ జేబుకు భారం కాకుండా ఉండేలా అధిక మైలేజ్ అందించే బైకులను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. తక్కువ మెయింటెనెన్స్, పెట్రోల్ ఖర్చును తగ్గించే బైకుల కోసం వెతుకుతున్నారా. అలాంటి బైకుల కోసం సెర్చ్ చేసేవారికి హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) బెస్ట్ ఛాయిస్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.55,992 నుంచి మొదలవుతుంది. ఈ ధరలోనే ఇది ఏకంగా లీటర్ పెట్రోలుకు 70కిలోమీటర్ల మైలేజ్ అందించడం దీని ప్రత్యేకత. ఈ కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే, అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా నిలిచింది.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్రత్యేకతలు
ఈ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ప్రధాన బలం దాని సాంకేతిక లక్షణాలు, నమ్మకమైన ఇంజన్. ఈ బైక్‌లో 97.2సీసీ సామర్థ్యం గలం ఎయిర్-కూల్డ్ 5-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 8000 rpm వద్ద 8.02 PS గరిష్ట శక్తిని, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు సరిపడా శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా 9.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో పాటు ఇది అందించే 70 కిలోమీటర్ల మైలేజ్ వినియోగదారులకు పెట్రోల్ ఖర్చును గణనీయంగా ఆదా చేస్తుంది.

ఇక బైక్ నిర్మాణ పరంగా చూస్తే.. ఇందులో 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. సురక్షితమైన డ్రైవింగ్ కోసం ముందు, వెనుక చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లను అమర్చారు. బైక్ బరువు 112 కిలోగ్రాములు మాత్రమే ఉండటం వల్ల రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా దీనిని సులభంగా నడపవచ్చు. ఇది గంటకు 85 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో అనలాగ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ వంటి ప్రాథమిక అంశాలను చేర్చారు.
నాలుగు వేరియంట్లలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వాటి ఫీచర్ల తేడాల ఆధారంగా ధరలు మారుతుంటాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.55,992 నుండి ప్రారంభమై టాప్ మోడల్‌కు రూ.66,382 వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్, మెరుగైన విశ్వసనీయతను కోరుకునే వినియోగదారులకు ఈ బైక్ తొలి ప్రాధాన్యతగా నిలుస్తుంది. అందుకే ఈ మోడల్ గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాల వరకు ఎక్కువ మంది వినియోగదారుల ఆదరణ పొంది అమ్మకాలలో స్థిరంగా ముందంజలో ఉంది.
ఫీచర్లు సంక్షిప్తంగా.. :
*ఇంజిన్ సామర్థ్యం-97.2 సీసీ (ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్)
*గరిష్ట శక్తి (Power) -8.02 PS @ 8000 rpm
*గరిష్ట టార్క్ (Torque)-8.05 Nm @ 6000 rpm
*మైలేజ్ (Mileage)-70 Kmpl
*ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం- 9.6 లీటర్లు
*గేర్‌బాక్స్- 4-స్పీడ్ గేర్‌బాక్స్
*బ్రేక్స్ -ముందు, వెనుక చక్రాలపై డ్రమ్ బ్రేక్స్
*టాప్ స్పీడ్- 85 kmph
*కీలకమైన ఫీచర్లు- అనలాగ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్
*బరువు (కర్బ్ వెయిట్)-112 కిలోగ్రాములు












Click it and Unblock the Notifications