IndiGo: అక్టోబర్ 31 వరకు విమానాలు బంద్! 4 నగరాలకు సర్వీసులు రద్దు

పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలోని ప్రధాన నగరాలకు నడిపే విమాన సర్వీసులను తాత్కాలికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.

Middle East Tension IndiGo Extends Suspension Of Riyadh Jeddah Dammam Flights Due To Regional Safety
ఆకాశంలో పిడుగుల వర్షం.. 17 వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీ!
ఆకాశంలో పిడుగుల వర్షం.. 17 వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీ!

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు నడిచే విమానాలను అక్టోబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. అలాగే జెద్దా, దమ్మామ్, మదీనా నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను అక్టోబర్ 27 వరకు నిలిపివేశారు. భద్రతా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఈ సేవలు పునరుద్ధరించబడబోవని ఎయిర్‌లైన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.

భారీగా పెరిగిన టికెట్ల ధరలు! తక్షణమే అమల్లోకి కొత్త ధరలు..
భారీగా పెరిగిన టికెట్ల ధరలు! తక్షణమే అమల్లోకి కొత్త ధరలు..

విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు వారు బుకింగ్ సమయంలో అందించిన కాంటాక్ట్ వివరాల ద్వారా సమాచారం అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా సౌదీ నగరాలకు తమ విమాన సర్వీసులను నిలిపివేసి, టికెట్ల రీఫండ్ లేదా ఉచిత రీషెడ్యూలింగ్ ఆప్షన్లు కల్పిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+