ముఖేష్ అంబానీ దినసరి సంపాదన రూ.187.9 కోట్లు, కరిగిపోతున్న అనిల్ అంబానీ ఆస్తి

ముంబై: భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ ఒక్కరోజు వేతనం ఎంతో తెలుసా? ఆయన ఒక్క రోజు వేతనం రూ.187.9 కోట్లు. గతంలో కంటే ఆయన సోదరుడు అనిల్ అంబానీ ఒక్కరోజు వేతనం రూ.14 కోట్లు తగ్గింది. భారతదేశంలోని టాప్ 100 సంపన్నుల్లో ముఖేష్ అంబానీ వరుసగా 11వసారి మొదటి స్థానంలో నిలిచారు.

అతని నికర ఆస్తులు 47.3 బిలియన్ డాలర్లు. అంటే రూ.3,48,934.47 కోట్లు. గత ఏడాది 9.3 బిలియన్ల ఆస్తి అతనికి జత కలిసింది. అదే సమయంలో గత ఏడాది అనిల్ అంబానీ సంపద 3.15 బిలియన్ డాలర్ల నుంచి 2.44 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. అత్యంత సంపన్నుల్లో అనిల్ అంబానీ గత ఏడాది 45వ స్థానంలో ఉండగా, ఈసారి 68 స్థానానికి పడిపోయారు.

 Mukesh Ambani earned Rs 187.9 crore per day last year while his younger brother lost Rs 14 crore,

2018 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 11వ ఏడాది ముఖేష్ ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ఈయన సంపద దాదాపు రూ. 3.49లక్షల కోట్లు. ఈ ఒక్క ఏడాదే ముఖేష్ సంపద రూ.68 వేల కోట్లు పెరిగింది.

ఈ లెక్కన ఆయన రోజువారీ సంపాదన కూడా పెరిగింది. ఏడాది కాలంగా ఆయన దినసరి సంపాదన రూ.187.9కోట్లు. ప్రస్తుతం ముకేశ్‌ అంబానీ సంపద 47.3 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా, అనిల్ అంబానీ సంపద మాత్రం 18.2 బిలియన్‌ డాలర్ల నుంచి 2.4 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+