కొత్త 20 రూపాయల నోటు వస్తుందోచ్..!
హైదరాబాద్ : నోట్ల రద్దుతో కొత్త నోట్లు తెరపైకి వచ్చాయి.ఇప్పటికే 2000, 500, 200, 100, 50, 10 డినామినేషన్లలో కొత్త నోట్లు విడుదలయ్యాయి. 20 రూపాయల నోటు మాత్రం ఇంతకాలం పెండింగ్ లోనే ఉంది. అయితే ఆర్బీఐ తాజా నిర్ణయంతో కొత్త 20 రూపాయల నోటు త్వరలోనే మార్కెట్లోకి రానుంది. దీనికి అదనపు ఫీచర్లను జోడిస్తూ రిలీజ్ చేస్తామని వెల్లడించారు అధికారులు.
2016 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 20 నోట్ల రూపాయల వాటా 492 కోట్లు. అదే మార్చి 2018 నాటికి వాటి సంఖ్య 1000 కోట్లకు చేరింది. దీంతో మొత్తం కరెన్సీలో 20 రూపాయల నోట్ల వాటా 9.8 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications