డబుల్ ధమాకా: పండుగ వేళ వాహన ప్రియులకు అదిరిపోయే న్యూస్!

దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ రేటులో నేడు(సెప్టెంబర్ 22) నవరాత్రి 2025 శుభ సందర్భంగా అమల్లోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలా వస్తువుల ధరలు తగ్గాయి. ముఖ్యంగా కార్లు, బైకులు, స్కూటర్లు కొనుగోలు చేసేవారికి భారీగా లాభం చేకూరనుంది. కొత్త జీఎస్టీ రేట్లు అమలు కావడంతో వాహనాలపై వినియోగదారుల డబ్బు గణనీయంగా ఆదా అవుతుంది.

కార్లు, బైకులు, స్కూటర్ల ధరలపై కొత్త జీఎస్టీ రేట్లు
నవరాత్రి మొదటచి రోజు నుంచే కార్లు, ద్విచక్ర వాహనాలు చౌకగా మారాయి. ఈ రోజు సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గింపు తర్వాత మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా, కియా, ఎంజీతో సహా అనేక కార్ల కంపెనీలు.. అలాగే హీరో, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకి, రాయన్ ఎన్‌ఫీల్డ్, యమహా వంటి ప్రముఖ టూ-వీలర్ కంపెనీలు తమ బైక్, స్కూటర్ల ధరలను తగ్గించనున్నాయి. కావున నేటి నుంచి వాహనాలు కొనుగోలు చేయబోయే వారికి భారీ ప్రయోజనం కలగనుంది. ఏ కంపెనీలు తమ మోడల్స్ ధరలను ఎంతవరకు తగ్గించాయో కూడా తెలుసుకుందాం.

New GST Rates in Effect Cars Bikes and Scooters Get Cheaper for Navratri

కంపెనీల వారీగా ధరల తగ్గింపు
జీఎస్టీ రేట్లు తగ్గడంతో, ప్రముఖ వాహన కంపెనీలు తమ ధరలను తగ్గించాయి. ముఖ్యంగా కార్ల కంపెనీలు భారీ తగ్గింపులను ప్రకటించాయి:

మారుతి సుజుకి: రూ. 1.29 లక్షల వరకు

టాటా మోటార్స్: రూ. 1.45 లక్షల వరకు

మహీంద్రా & మహీంద్రా: ఇప్పటికే రూ. 1.56 లక్షల వరకు తగ్గించాయి

హ్యుందాయ్: రూ. 2.4 లక్షల వరకు

వీటితో పాటు, హోండా, కియా, టయోటా, మెర్సిడెస్-బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఇతర కార్ల కంపెనీలు కూడా తమ మోడల్స్ ధరలను తగ్గించాయి. అలాగే, హీరో, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకి, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ద్విచక్ర వాహనాల కంపెనీలు కూడా తమ బైక్, స్కూటర్ల ధరలను తగ్గించాయి. ఇది నవరాత్రి పండుగ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేయడానికి వినియోగదారులకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.

జీఎస్టీ తగ్గింపు ఎలా పని చేస్తుంది?
ముందు: సెప్టెంబర్ 22కు ముందు, కార్లు, బైక్‌లపై కనీసం 28 శాతం జీఎస్టీతో పాటు అదనపు సెస్ కూడా ఉండేది.

ఇప్పుడు: కొత్త విధానం ప్రకారం, ఈ రేటును కనీసం 18 శాతానికి తగ్గించారు. ఈ 10 శాతం కంటే ఎక్కువ తగ్గింపు వల్ల వినియోగదారులకు భారీగా డబ్బు ఆదా అవుతుంది.ఉదాహరణకు 1200 సీసీ ఇంజిన్, 4 మీటర్ల వరకు పొడవు ఉన్న కార్లపై దాదాపు రూ.2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే, 350 సీసీ వరకు ఉన్న మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలు కూడా వేలల్లో తగ్గాయి. పండుగ సీజన్‌కు ముందు వాహనాల ధరల్లో ఈ తగ్గింపు ప్రజలకు ఒక బహుమతి లాంటిది, ఎందుకంటే పండుగ సీజన్‌లో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలను పెంచుతాయి. ఈ శుభవార్త ప్రజలకు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+