RBI: నామిని రూల్స్ పూర్తిగా మార్పు, ఇలా చేయకపోతే పైసా కూడా రాదు

జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో దాచుకుంటాం. కానీ, అనుకోనిది ఏమైనా జరిగి మనం దూరమైతే.. మనం ప్రాణంగా ప్రేమించే కుటుంబ సభ్యులు ఆ డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తే? లీగల్ కాగితాల కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తే ఎంత బాధాకరం? ఇటువంటి సమస్యలకు చెక్ పెడుతూ, ఖాతాదారుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సరికొత్త నామినేషన్ నిబంధనలను తీసుకువచ్చింది.

ఒక్కరు కాదు.. ఇప్పుడు ఏకంగా 4 మందికి నామినేషన్ అవకాశం!

ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలు, డిపాజిట్లు లేదా లాకర్లకు కేవలం ఒక్కరిని మాత్రమే నామినిగా పెట్టుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఆర్‌బీఐ నయా రూల్స్ ప్రకారం ఇకపై ఒక్కో ఖాతాకు గరిష్టంగా నలుగురు నామినీలుగా చేర్చుకోవచ్చు. సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు (FD), మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు లాకర్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న పిల్లలందరికీ లేదా కుటుంబ సభ్యులకు సమానంగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం దక్కుతుంది.

New RBI Nomination Rules Add Up to 4 Nominees to Your Bank Accounts and Mutual Funds Effortlessly

ఎవరికి ఎంత షేర్ ఇవ్వాలో మీరే నిర్ణయించవచ్చు!

ఈ కొత్త విధానంలో ఉన్న మరో పెద్ద సదుపాయం ఏంటంటే.. ఏ నామినీకి ఎంత శాతం సొమ్ము చెందాలో ఖాతాదారే స్వయంగా నిర్ణయించవచ్చు (Simultaneous Nomination). ఉదాహరణకు, మీ డిపాజిట్ సొమ్ములో భార్యకు 50%, ఇద్దరు పిల్లలకు చెరో 25% చొప్పున పంచుతూ నామినేషన్ ఫారమ్‌లోనే స్పష్టంగా నమోదు చేయవచ్చు. మీ తర్వాత బ్యాంకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ శాతాల ప్రకారమే సొమ్మును నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది.

ఆ ఒక్క తప్పు చేస్తే పైసలు ఆగిపోతాయి.. జాగ్రత్త!

నామినీ పేరు నమోదు చేసేటప్పుడు చాలామంది చేసే చిన్న పొరపాటే కొంపముంచుతుంది. ఇంట్లో పిలిచే పేర్లు లేదా సగం పేర్లు బ్యాంకు రికార్డుల్లో రాయడం వల్ల తర్వాత క్లెయిమ్ సమయంలో బ్యాంకర్లు తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందుకే మీ నామినీ అధికారిక గుర్తింపు కార్డుల్లో (ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ఐడీల్లో) పేరు ఎలా ఉందో, అక్షరదోషాలు లేకుండా సరిగ్గా అదే పేరును బ్యాంకు రికార్డుల్లో నమోదు చేయాలి.

ఆలస్యం చేయకండి.. ఇప్పుడే అప్‌డేట్ చేయండి!

"ఏదో ఒక రోజు చేద్దాంలే" అని వాయిదా వేస్తే.. అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు మన కుటుంబానికి పెద్ద సమస్యగా మారుతుంది. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మనవాళ్లకు భద్రంగా చేరాలంటే.. వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లేదా నెట్ బ్యాంకింగ్/మోబైల్ యాప్ ద్వారా మీ నామినీ వివరాలను సరిచూసుకోండి. అవసరమైతే కొత్తగా నామినీలను యాడ్ చేసి మీ కుటుంబ భవిష్యత్తుకు భరోసానివ్వండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+