నెక్ట్స్ లెవెల్ ఫీచర్స్: జనవరిలో రాబోయే అదిరిపోయే కార్లు ఇవే!
ఆటోమొబైల్ ప్రేమికులకు అదిరిపోయే గుడ్ న్యూస్. కొత్త సంవత్సరం ఓ సరికొత్త అనుభూతిని పంచబోతోంది. ముఖ్యంగా జనవరి నెలలో భారత రోడ్లపైకి రానున్న కార్లు టెక్నాలజీ, డిజైన్, పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉండబోతున్నాయి. మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేస్తుండగా.. కియా, మహీంద్రా వంటి ఆటో దిగ్గజాలు తమ పాపులర్ మోడళ్లను సరికొత్త హంగులతో సిద్ధం చేశాయి.
మారుతి సుజుకి నుంచి తొలి ఎలక్రిక్ అడుగు.. ఇ-విటారా
ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ.. ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. జనవరి 15న విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ 'ఇ విటారా'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో 49kWh, 61kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండనున్నాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 543 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది. 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్డ్ ADAS ఫీచర్లతో రానున్న ఈ కారు ధర రూ. 17 లక్షల నుంచి రూ. 22.50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

కియా సెల్టోస్ 2.0.. సరికొత్త డిజైన్‌తో ఎంట్రీ
కియా సంస్థ తన అత్యంత విజయవంతమైన మోడల్ 'సెల్టోస్'ను కొత్త జనరేషన్ వెర్షన్‌లో జనవరి 2న లాంచ్ చేయబోతోంది. కొత్త K3 ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కారులో 'డిజిటల్ టైగర్ నోస్ గ్రిల్', ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి. లోపల 12.3-అంగుళాల డ్యూయల్ డిస్‌ప్లే కేబిన్‌కు ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. దీని ధర రూ. 11.20 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉండవచ్చు.

మహీంద్రా, టాటా నుంచి అప్‌డేటెడ్ మోడళ్లు
మహీంద్రా తన ప్రజాదరణ పొందిన XUV700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా XUV 7XOని జనవరి 5న తీసుకురాబోతోంది. ఇందులో సరికొత్త ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరోవైపు టాటా మోటార్స్ తన బెస్ట్ సెల్లింగ్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ (Punch) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేసింది. కొత్త ఫ్రంట్ ఫేసియా, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఇది మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ. 5.50 లక్షల నుంచే ప్రారంభం కావడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.

తిరిగి వస్తున్న ఐకానిక్ 'డస్టర్'
ఒకప్పుడు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్.. సరికొత్త రూపంలో జనవరి 26న మళ్లీ మన ముందుకు రాబోతోంది. CMF-B ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన ఈ కొత్త తరం డస్టర్ మరింత శక్తివంతమైన ఇంజన్, ప్రీమియం ఇంటీరియర్స్‌తో వస్తోంది. ఇది మార్చి 2026 నాటికి విక్రయానికి అందుబాటులోకి రావచ్చు. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉంది.

గ్లోబల్ బ్రాండ్ల పోటీ: విన్ ఫాస్ట్, నిస్సాన్
వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'విన్ ఫాస్ట్ (VinFast)' తన VF3 మోడల్‌తో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇది చిన్న కారు అయినప్పటికీ.. ఎస్‌యూవీ లాంటి లుక్, 215 కి.మీ రేంజ్‌తో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోనుంది. అలాగే నిస్సాన్ సంస్థ తన 7-సీటర్ MPV గ్రావైట్ (Gravite), క్రెటాకు పోటీగా టెక్టాన్ (Tekton) అనే రెండు ముఖ్యమైన మోడళ్లను ప్రదర్శించబోతోంది. 2026 జనవరి నెల భారత ఆటోమొబైల్ రంగానికి ఒక 'సూపర్ నెల' అని చెప్పవచ్చు. బడ్జెట్ కార్ల నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల వరకు వినియోగదారులకు బోలెడన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications