Banking Rules: ఇకపై ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు..

Banking Rules: సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేనిపక్షంలో బ్యాంకులు పెనాల్టీలు వేస్తుంటాయనే విషయం తెలిసిందే. అయితే చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వినియోగదారులకు ఒక గొప్ప ఊరటనిచ్చాయి. సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వను నిర్వహించనందుకు విధించే ఛార్జీని తొలగించాయి. ఇకపై ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్నవారు ఖాతాలో కనీస నిల్వను ఉంచాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఆ బ్యాంకులు ఏంటంటే.. ?

పంజాబ్ నేషనల్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కూడా ఇటీవల కనీస సగటు నిల్వ (ఎంఎబి) నిర్వహించకపోయినా తమ వినియోగదారుల నుండి ఎటువంటి జరిమానా వసూలు చేయబోమని ప్రకటించింది. ఇంతకుముందు పీఎన్‌బీలో ఈ జరిమానా లోటు ప్రకారం విధించేవారు. అంటే, నిల్వ ఎంత తక్కువగా ఉంటే ఛార్జీ అంత ఎక్కువగా ఉండేది. ప్రతి నెల నిల్వ నిర్వహించడం కష్టంగా ఉన్న లక్షలాది మంది వినియోగదారులకు, ముఖ్యంగా విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, చిన్న పట్టణాల ప్రజలకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తుంది.జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. మహిళలు, రైతులు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు ఎండీ, సీఈవో అశోక్ చంద్ర వెల్లడించారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్‌బీఐ- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 సంవత్సరంలోనే కనీస నిల్వల నిబంధనను రద్దు చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు, ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాలో నిల్వ తగ్గిపోయినా ఎటువంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు.

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ మే 2025లోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ, జీతం, ఎన్ఆర్ఐ ఖాతాల వంటి అన్ని సేవింగ్స్ ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది. అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్నారైల ఎస్బీ అకౌంట్లరు, మరికొన్ని ఇతర ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం కూడా జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు ఇకపై మినిమం బ్యాలెన్స్ నిల్వల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారికంగా ప్రకటించింది. ఇకపై మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు ఉండవని.. ఇది అన్ని సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా జులై 2వ తేదీన ఎక్స్ వేదికగా ప్రకటించింది.

ఇండియన్ బ్యాంక్

ఈ జాబితాలో ఇండియన్ బ్యాంక్ కూడా చేరింది. జులై 7వ తేదీ నుంచి మినిమం బ్యాలెన్స్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇది సేవింగ్స్ ఖాతాదారులందరికీ వర్తించనుంది. ఈ క్రమం మినిమం బ్యాలెన్స్ లేకున్నా ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు.

సగటు నెలవారీ నిల్వల నియమం ప్రకారం వినియోగదారులు తమ సేవింగ్స్ ఖాతాలో ఒక నిర్దిష్ట మొత్తాన్ని నిర్వహించాల్సి ఉంటుందని తెలుసుకోండి. ఉదాహరణకు, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ. 10,000 నిల్వ ఉంచాలి. మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసిన మొత్తం రూ. 10,000 కంటే తక్కువగా ఉంటే, తగ్గిన మొత్తంలోని వ్యత్యాసంపై మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతాలో రూ. 8500 ఉందనుకుందాం, అప్పుడు మీరు రూ. 10,000 నుండి తగ్గిన మొత్తంపై అంటే రూ. 1500 పై జరిమానా చెల్లించవలసి ఉంటుంది. కానీ ఇండియన్ బ్యాంక్, ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇకపై తమ వినియోగదారుల నుండి సగటు నెలవారీ నిల్వల కోసం జరిమానా వసూలు చేయవు. ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+