NTPC Green: ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ ఓపెన్..
ఎన్టీపీసీ (NTPC) గ్రీన్ ఎనర్జీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ప్రారంభం అయింది. నవంబర్ 19 నుంచి 22 వరకు ఓపెన్ అయి ఉంటుంది. కంపెనీ ఒక్కొక్క షేర్ ధరను రూ. 102-109 గా నిర్ణయించింది. 92.59 కోట్ల షేర్లతో తాజా ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 10,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరంలో ఎన్టీపీసీ గ్రీన్ మూడో అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. దీని కంటే ముందు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఐపీఓ(రూ. 28,756 కోట్లు), స్విగ్గీ ఐపీఓ (రూ. 11,327 కోట్లు) ఉన్నాయి.
రిటైల్ పెట్టుబడిదారుడు ఐపీఓలో పాల్గొనాలంటే కనీసం 138 షేర్లుకొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం రూ.14,904 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ తన అర్హులైన ఉద్యోగుల కోసం రూ. 200 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేసింది. వారు ఒక్కో షేరుకు రూ. 5 తగ్గింపును కూడా పొందనున్నారు. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ (NREL)లో పెట్టుబడికి ఉపయోగించనున్నారు.

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నికర ఆఫర్‌లో 75 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్లు (QIBలు) కోసం రిజర్వ్ చేసింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NIIలు) నికర ఆఫర్‌లో 15 శాతం, మిగిలిన 10 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించారు. ఎన్టీపీసీ గ్రీన్ ఇప్పటికే అనేక ప్రాజెక్టులు చేపట్టింది. కంపెనీ సౌర ప్రాజెక్టుల నుంచి 3,071 MW విద్యుత్, ఆరు రాష్ట్రాలలోని పవన ప్రాజెక్టుల నుంచి 100 MW ఆపరేషనల్ కెపాసిటీని కలిగి ఉంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP)కి రూ. 1 కంటే తక్కువగా ఉంది.
జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 607.42 కోట్ల ఆదాయంతో రూ. 138.61 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను రూ. 91,000 కోట్లుగా ఉంది. ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్, HDFC బ్యాంక్, IIFL సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ NTPC గ్రీన్ ఎనర్జీ IPO బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా ఉన్నాయి.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications