అఫైర్ ఎఫెక్ట్.. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ రాజీనామా!

ప్రపంచ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెను ప్రకంపనలు సృష్టించే పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సెన్ హువాంగ్ కంపెనీలోని అన్ని కీలక పదవులకు రాజీనామా చేశారు. కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో, బోర్డు సభ్యుడి పదవుల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్విడియా కార్పొరేషన్ నవంబర్ 12న అధికారికంగా ధ్రువీకరించింది.

IND vs PAK: ఫైనల్లో ఇండియా vs పాకిస్థాన్.. ప్రతీకారానికి రెడీ!
IND vs PAK: ఫైనల్లో ఇండియా vs పాకిస్థాన్.. ప్రతీకారానికి రెడీ!

అఫైర్, గూఢచర్యం వివాదాల నడుమ
జెన్సెన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం, చైనాతో ముడిపడి ఉన్న వ్యాపార వ్యవహారాలపై తీవ్ర వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ రాజీనామా నిర్ణయం వెలువడింది. జెన్సెన్ హువాంగ్‌కు అత్యంత సన్నిహితురాలైన ఆలిస్ హువాంగ్ చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారంటూ అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేయడం, ఆమెతో జెన్సెన్ హువాంగ్‌కు ఉన్న అఫైర్ వ్యవహారం బయటపడటంతో కంపెనీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే జెన్సెన్ హువాంగ్ తన పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Nvidia CEO Jensen Huang Resigns With Immediate Effect Amid Affair and Espionage Controversy

33 ఏళ్ల ప్రస్థానానికి తెర.. తాత్కాలిక సీఈవోగా కోలెట్ క్రెస్
1993లో ఎన్విడియా సంస్థలను స్థాపించిన జెన్సెన్ హువాంగ్ దాదాపు 33 ఏళ్ల పాటు కంపెనీని ముందుండి నడిపించారు. ఆయన సారథ్యంలోనే ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ చిప్ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో సెప్టెంబర్ 2013 నుంచి కంపెనీలో పనిచేస్తున్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించారు. శాశ్వత సీఈవో సెలెక్షన్ కోసం కంపెనీ అంతర్గతంగానూ, బయట నుంచి అన్వేషణ ప్రారంభించినట్లు ఎన్విడియా తెలిపింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సరికొత్త చరిత్ర.. ఇక అంతా ఏఐ మయం!
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సరికొత్త చరిత్ర.. ఇక అంతా ఏఐ మయం!

బోర్డు తొలి ఛైర్మన్‌గా హార్వే సి.జోన్స్
మరోవైపు కంపెనీ బోర్డు తొలి ఛైర్మన్‌గా హార్వే సి.జోన్స్‌ను నియమించారు. 33 ఏళ్ల పాటు ఎన్విడియా అభివృద్ధికి జెన్సెన్ హువాంగ్ చేసిన సేవలను సంస్థ ప్రశంసించింది. నాయకత్వ మార్పు జరిగినప్పటికీ.. కంపెనీ రోజువారీ కార్యకలాపాలు, వినియోగదారులకు ఇచ్చిన హామీలు, కొత్త ఉత్పత్తుల తయారీ ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఎన్విడియా స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+