అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర మీదికి వచ్చారు. తన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 6:30 నిమిషాలకు ఆయన ప్రసంగం ఆరంభమైంది. 19 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగం అంతా దాదాపు ఇరాన్ చుట్టే తిరిగింది. రెండు మూడు వారాల్లో ఇరాన్‌ను చాలా గట్టిగా దెబ్బ కొడతామని, వారు ఎక్కడ ఉండాలో అక్కడికి పంపుతామని అన్నారు. ఆ రాతియుగానికి వారిని తిరిగి పంపిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఆయన ప్రసంగం తర్వాత చమురు ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లు అస్థిరం అయ్యాయి. ఈ యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు సన్నగిల్లాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు ఫ్యూచర్స్ 4.1 శాతం పెరిగి బ్యారెల్‌కు 104.21 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ జూన్ డెలివరీకి ఏకంగా అయిదు శాతం పెరిగి బ్యారెల్‌కు 106.42 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అనిశ్చితికి అద్దం పట్టింది.

ఈ పరిణామాల మధ్య అందరి దృష్టి కూడా దేశీయ పెట్రోల్, డీజిల్ రేట్లపై పడింది. ముడి చమురు ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తీవ్ర ప్రతికూల పరిణామాల్లోనూ దేశంలో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగానే ఉంటోన్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలేవీ కూడా ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయట్లేదు. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల రిటైల్ ధరలు తగ్గట్లేదు.
నేడు వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52












Click it and Unblock the Notifications