Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వన్ ప్లస్ దీపావళి ఆఫర్

దీపావళి సేల్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ ప్రకటించింది. తేదీని ప్రకటించకపోయినప్పటికీ ఏయే ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయో తెలిపింది. వన్ ప్లస్ యాప్ ద్వారా కొనుగోలు చేసేవారికి అదనపు ప్రయోజనాలుంటాయని పేర్కొంది. వన్ ప్లస్ 11 5జి, వన్ ప్లస్ బడ్స్ ప్రో2, వన్ ప్లస్ ప్యాడ్ ట్యాబ్లెట్ పై ఆఫర్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.

యాప్ ద్వారా కొనుగోలు చేయబోయేవారికి 18 నెలల ఈఎంఐ, ఎంపిక చేసిన మోడల్స్ పై ఉచిత యాక్సెసరీస్ వంటి వాటిని అందించనున్నట్లు పేర్కొంది. వన్ ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్ రూ.49,999 రాయితీ ధర లభించనున్నట్లు వన్ ప్లస్ తమ వెబ్ సైట్ లో తెలిపింది. బ్యాంకు ఆఫర్లను ఉపయోగించుకోవడంద్వారా మరో రూ.4వేలు ఆదా అవుతాయి. దీనిపై బడ్స్ జెడ్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం ఈఫోన్ ఇండియాలో రూ.56,999. సేల్ లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 3లైట్ 5జి ఫోన్ రూ.17,499, వన్ ప్లస్ నార్డ్ 3 5జీ రూ.28,999, వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జి రూ.22,999 ప్రారంభ ధర వద్ద లభించనున్నాయి. ఇవన్నీ బ్యాంకు ఆఫర్లతో కలిపి అని కంపెనీ వెల్లడించింది.

oneplus diwali sale details

వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ఈ సేల్ లో బ్యాంకు రాయితీతో కలిపి రూ.7,999కి లభించనుంది. ఈ ఇయర్ ఫోన్స్ ఈ ఏడాది మార్చిలో మార్కెట్ లోకి విడుదలయ్యాయి. వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.2299కి అందుబాటులో ఉంది. మరోవైపు వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ జెడ్ 2 బ్యాంకు రాయితీతో కలుపుకొని 1349, వన్ ప్లస్ నార్డ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ రూ.599 వరకు సేల్ లో ఉన్నాయి.

ఈ సేల్ లో వన్ ప్లస్ ప్యాడ్ రూ.36,999కే లభించనుంది. త్వరలో విడుదల కాబోతున్న వన్ ప్లస్ ప్యాడ్ గో కూడా అమ్మకానికి ఉంచారు. ఈనెల ఆరోతేదీ తర్వాత ధర ఎంతనేది ప్రకటిస్తారు. స్మార్ట్ వాచ్ ల విషయానికొస్తే నార్డ్ వాచ్ రూ.4,999 వద్ద దీపావళి సేల్ లో అందుబాటులో ఉండనుంది. వన్ ప్లస్ టీవీ 65క్యూ2 ప్రో కొనుగోలుదారులకు అదనంగా రూ.5వేలు తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ.94,999.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+