Oracle Layoffs: చేతికి వచ్చే పరిహారంపైన కూడా పన్ను పోటా?

ప్రముఖ ఐటీ దిగ్గజం ఒరాకిల్ (Oracle) ఇటీవల చేపట్టిన సామూహిక ఉద్యోగ కోతలు టెక్ ప్రపంచంలో కలకలం రేపాయి. భారతదేశంలో సుమారు 12,000 మంది, ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులపై వేటు వేయడం ఆయా కుటుంబాలను ఆందోళనలోకి నెట్టింది. అయితే, కంపెనీ ప్రకటించిన 'సెవరెన్స్ ప్యాకేజీ' (పరిహారం) భారీగా కనిపిస్తున్నప్పటికీ, భారత పన్ను నిబంధనల ప్రకారం అందులో సింహభాగం ప్రభుత్వానికే వెళ్లనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒరాకిల్ తన ఉద్యోగులకు ప్రతి పూర్తి చేసిన ఏడాదికి 15 రోజుల జీతం, పెండింగ్ వేతనాలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీతో పాటు రెండు నెలల అదనపు 'టాప్-అప్' జీతాన్ని ఆఫర్ చేసింది. కానీ, భారత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఈ సెవరెన్స్ ప్యాకేజీని "వేతనానికి బదులుగా లాభాలు" (Profits in lieu of salary)గా పరిగణిస్తారు. అంటే, ఈ మొత్తం మీ వార్షిక ఆదాయానికి జోడించబడి, మీరు ఏ పన్ను స్లాబ్ (Tax Slab)లో ఉంటే ఆ రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్ఛార్జ్, ఎడ్యుకేషన్ సెస్ అదనం.

Oracle Layoffs 2026 Tax Implications on Severance Package for 12 000 Indian Employees and Legal Exemptions

తేదీని బట్టి మారుతున్న చట్టాలు!

విశేషమేమిటంటే, ఈ పరిహారం మీకు ఏ తేదీన అందిందనేది చాలా ముఖ్యం.

  • మార్చి 31, 2026 లోపు అందుకుంటే.. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పన్ను విధిస్తారు.
  • ఏప్రిల్ 1, 2026 తర్వాత అందుకుంటే.. కొత్తగా అమల్లోకి వచ్చే ఆదాయపు పన్ను చట్టం, 2025 నిబంధనలు వర్తిస్తాయి.

మినహాయింపులు ఎక్కడ దొరుకుతాయి?

సాధారణంగా వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకునే వారికి రూ. 5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. కానీ ఒరాకిల్ తీసేసింది కాబట్టి, ఆ వెసులుబాటు వీరికి వర్తించదు. అయితే, ఈ క్రింది అంశాల్లో ఉపశమనం పొందవచ్చు..

  • గ్రాట్యుటీ: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు రూ. 20 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
  • లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్: ప్రభుత్వేతర ఉద్యోగులకు గరిష్టంగా రూ. 25 లక్షల వరకు మినహాయింపు పొందే వీలుంది.
  • సెక్షన్ 89 రిలీఫ్: ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు రావడం వల్ల పన్ను భారం పెరిగితే, ఆ ఆదాయాన్ని గత సంవత్సరాలకు విస్తరించి (Spread over) పన్ను తగ్గించుకునే సౌకర్యం ఈ సెక్షన్ కల్పిస్తుంది.

నిపుణుల సలహా: ప్లానింగ్ ముఖ్యం!

"ఒకసారి భారీ మొత్తం చేతికి వచ్చినప్పుడు ఆత్రుత పడకుండా, ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్లలో పెట్టుబడి పెట్టడం మంచిది" అని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. సెక్షన్ 80C (PPF, ఇన్సూరెన్స్), 80D (హెల్త్ ఇన్సూరెన్స్), మరియు NPS వంటి మార్గాల ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు.

ముఖ్యంగా, రిలీవింగ్ లెటర్ లేదా నిష్క్రమణ పత్రాలపై సంతకం చేసే ముందు.. అందులో నోటీసు పే, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి వివరాలు విడివిడిగా (Breakup) ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది భవిష్యత్తులో ఐటీ నోటీసులు రాకుండా కాపాడుతుంది. ఉద్యోగం పోయిన బాధలో ఉన్న వారికి ఈ పన్ను భారం 'గోరుచుట్టుపై రోకలిపోటు' లాంటిదే అయినా, సరైన ప్లానింగ్‌తో కొంత ఉపశమనం పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+