Credit Card Bill: మినిమమ్ డ్యూ కడుతున్నారా?

క్రెడిట్ కార్డు వాడే ప్రతీ ఒక్కరూ తప్పుకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ప్రతినెలా క్రెడిట్ కార్డు బిల్లు రాగానే పూర్తి మొత్తం కట్టకుండా, కేవలం 'మినిమమ్ అమౌంట్ డ్యూ' (Minimum Due) చెల్లించి సరిపెట్టేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే. చూడటానికి ఇది ఆ సమయంలో చిన్న ఊరటనిచ్చినప్పటికీ, భవిష్యత్తులో అది మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తలకిందలు చేస్తుంది. ఏడాది పాటు క్రమం తప్పకుండా డబ్బులు కట్టినప్పటికీ, అసలు బకాయి మాత్రం ఇంచ్‌ కూడా కరగకపోగా, కొండలా పెరిగిపోయే ప్రమాదం ఉంది.

చాలామంది క్రెడిట్ కార్డు యూజర్లు చేసే అతి పెద్ద పొరపాటు కేవలం మినిమమ్ డ్యూ చెల్లించడం. దీనివల్ల అసలు భారం తగ్గకపోగా, వడ్డీలు మోతెక్కిపోతాయి. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డులో రూ. 1 లక్ష బిల్ కట్టాలనుకుందా. కొత్తగా ఎటువంటి ఖర్చులు చేయకపోయినా, నెలకు దాదాపు 3.75 శాతం చొప్పున (సంవత్సరానికి 45 శాతం వరకు) ఫైనాన్స్ ఛార్జీలు, జీఎస్‌టీ పడుతుంటాయి. ఇలాంటి సమయంలో మీరు ప్రతినెలా కేవలం మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లిస్తూ వస్తే.. ఏడాదిలో మీరు మొత్తంగా సుమారు రూ. 69,160 వరకు చెల్లిస్తారు. కానీ అందులో కేవలం రూ. 21,530 మాత్రమే మీ అసలు బకాయి నుంచి తరుగుతుంది. మిగతా రూ. 47,630 పైచిలుకు కేవలం వడ్డీలు, జీఎస్‌టీ రూపంలోనే బూడిదలో పోసిన పన్నీరులా మాయమవుతాయి. అంటే ఏడాది పాటు దాదాపు 69 వేలు కట్టినప్పటికీ, మీ అసలు బాకీ మాత్రం ఇంకా రూ. 78 వేలకు పైనే మిగిలి ఉంటుంది.

Paying Only Minimum Due On Your Rs 1 Lakh Credit Card Bill Leaves Huge Debt After One Year Of Paying

వడ్డీ లేని గడువు రద్దు.. కొత్త కొనుగోళ్లతో మరింత పెరిగే భారం

మినిమమ్ డ్యూ కట్టడం వల్ల మరో పెద్ద నష్టం కూడా ఉంది. సాధారణంగా క్రెడిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లకు కొంత వడ్డీ లేని గడువు (Interest-free period) లభిస్తుంది. అయితే మీరు గత బిల్లును పూర్తిగా చెల్లించకుండా కొంత భాగం మాత్రమే ముందుకు తెస్తే, ఆ వెసులుబాటు రద్దవుతుంది. ఆటోమేటిక్‌గా లావాదేవీ జరిగిన తేదీ నుంచే వడ్డీ పడటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు కొత్తగా ఏవైనా వస్తువులు కొనుగోలు చేసినా లేదా ఖర్చులు చేసినా వాటికి కూడా మొదటి నుంచే భారీగా వడ్డీ పడుతుంది. పాత బకాయి అలానే ఉండగా, కొత్త ఖర్చులు తోడైతే అప్పుల ఊబి నుంచి బయటపడటం సామాన్యమైన విషయం కాదు.

Credit Card మార్చితే పెద్ద చిక్కే! ఆటో పేమెంట్స్ ఫెయిల్ అయితే నష్టమే!
Credit Card మార్చితే పెద్ద చిక్కే! ఆటో పేమెంట్స్ ఫెయిల్ అయితే నష్టమే!

ఎప్పుడు అప్రమత్తం కావాలి? మీ కార్డు ప్రమాదంలో ఉందా?

ఒకానొక నెలలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మినిమమ్ డ్యూ కట్టడం వేరు, ప్రతినెలా అదే అలవాటుగా మార్చుకోవడం వేరు. క్రమం తప్పకుండా డబ్బులు కడుతున్నప్పటికీ మీ అవుట్‌స్టాండింగ్ బకాయి మాత్రం అస్సలు తగ్గకపోవడం, జీతం డబ్బులు సరిపోక నిత్యవసర ఖర్చుల కోసం కూడా క్రెడిట్ కార్డును వాడాల్సి రావడం, ఒక అప్పు తీర్చడానికి మరో చోట అప్పు చేయాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలి. క్రెడిట్ కార్డు అనేది కేవలం ఒక పేమెంట్ టూల్ మాత్రమే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ వడ్డీతో కూడిన రుణంలా మారకుండా చూసుకోవాలి. ఒకవేళ అప్పు భారీగా ఉంటే, తక్కువ వడ్డీ లభించే పర్సనల్ లోన్‌కు మళ్లించడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు.

అప్పుల ఊబిలో చిక్కుకున్నారా? ఈ 5 చిట్కాలతో బయటపడండి!
అప్పుల ఊబిలో చిక్కుకున్నారా? ఈ 5 చిట్కాలతో బయటపడండి!

మినిమమ్ డ్యూ అనేది కేవలం ఆ క్షణానికి మీ అకౌంట్ బ్లాక్ కాకుండా కాపాడే ఒక తాత్కాలిక భద్రతా వలయమే తప్ప, అప్పు నుంచి శాశ్వతంగా విముక్తి కలిపే మార్గం మాత్రం కాదు. ప్రతినెలా బిల్లు కట్టేటప్పుడు "ఈ నెలకు సరిపోతుందా?" అని ఆలోచించడంతో పాటు, "నా అసలు బకాయి నిజంగానే తగ్గుతోందా?", "ఈ అప్పు ఎప్పటికీ తీరుతుంది?" అనే రెండు ప్రశ్నలు వేసుకోండి. కొన్ని బిల్లింగ్ సైకిల్స్ గడిచినా మీకు దీనిపై స్పష్టత రాకపోతే, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను వెంటనే మార్చుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+