బ్యాంకింగ్ లో నూతన అధ్యాయం: రేపు ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒడిశాలో పర్యటించనున్నారు. రాజధాని భువనేశ్వర్ శివారులోని జట్నీలో నూతనంగా నిర్మించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యాధునిక డేటా సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. సుమారు రూ.169 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు దీన్ని. బ్యాంకింగ్ రంగానికి అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత విస్తరించడంలో ఇదొక మైలురాయిగా నిలవబోతోంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ సేవలు సురక్షితంగా సాగడానికి ఇది తోడ్పడుతుంది.

మొదట ప్రధాని మోదీ వారణాసిలో పర్యటిస్తారు. అక్కడ అరవింద్ లిమిటెడ్ గార్మెంట్ ఇండస్ట్రీని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వారణాసిలోని నమో ఘాట్ వద్ద భారత వైమానిక దళం నిర్వహించే వింగ్స్ ఓవర్ గంగాస్ విన్యాసాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ ప్రదర్శనలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలు, లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్‌, సుఖోయ్-30ఎమ్‌కేఐ, రఫేల్ వంటి ప్రముఖ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీమ్, సారంగ్ హెలికాప్టర్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

PM Modi Set to Inaugurate RBI New Data Centre and cybersecurity institute Bhubaneswar on Oct 25

అనంతరం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ కు చేరుకుంటారు. బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఖోర్ధా హెలిప్యాడ్‌కు చేరుకుని ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఇన్ఫో వ్యాలీ-2 లో ఉన్న ఆర్‌బీఐ ప్రాంగణానికి వెళతారు. 4:45 నిమిషాలకు ఆర్బీఐ అత్యాధునిక డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తమిళనాడులో ప్రతి ఇంటర్ స్టూడెంట్ కూ ఓ 'హీరో' సైకిల్, హెల్మెట్: సీఎం విజయ్ హీరోయిజం
తమిళనాడులో ప్రతి ఇంటర్ స్టూడెంట్ కూ ఓ 'హీరో' సైకిల్, హెల్మెట్: సీఎం విజయ్ హీరోయిజం

ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోనే అతిపెద్ద టైర్-4 సర్టిఫైడ్ కేంద్రాలలో ఒకటిగా ఈ ఆర్‌బీఐ డేటా సెంటర్ నిలవనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన డిజిటల్ లావాదేవీలు, పేమెంట్ సిస్టమ్స్ సెక్యూరిటీని ఈ సెంటర్ పర్యవేక్షిస్తుంది. అత్యవసర సమయాల్లోనూ ఆర్థిక సేవలు నిరంతరాయంగా అందేలా నాలుగు ప్రధాన డేటా సెంటర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న ఎయిర్ లైన్స్
సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న ఎయిర్ లైన్స్

దీనికి అనుబంధంగా సైబర్ సెక్యూరిటీ శిక్షణ సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికతలపై ఆర్థిక రంగానికి చెందిన నిపుణులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. సుమారు 18.55 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుందీ డేటా సెంటర్. బ్యాంకింగ్ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలకు అనుగుణంగా సైబర్ భద్రతను పెంచడం, డేటా నిర్వహణ వంటి కీలక కార్యకలాపాలు ఇక్కడి నుంచే సాగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+