చేతివృత్తులకు వారికి గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 3 లక్షల వరకు రుణం.. అర్హతలు ఇవే!
దేశంలో చిన్న తరహా పరిశ్రమలు , కళాకారులను ప్రోత్సహించేందుకు పీఎం విశ్వకర్మ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం సాంప్రదాయ కళాకారులు , చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద, అర్హులైన లబ్ధిదారులకు గ్యారెంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం అందించబడుతుంది. ఈ రుణానికి కేవలం 5 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.ఇది లబ్ధిదారులకు చేయూతను ఇవ్వడంతో పాటు వారి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.
పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు:
ఈ పధకం ద్వారా సాంప్రదాయ కళలు, చేతివృత్తులను చిన్న తరహా పరిశ్రమలను శక్తివంతం చేయడం , వారి ఆర్థిక స్థితిని మెరుగుపచడం, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తుంది. వారికి నైపుణ్య శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. తద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచాలన్నీ లక్ష్యంంతో ఈ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది.

పథకం యొక్క ప్రయోజనాలు:
ఈ పథకం కింద, అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. రుణాలపై కేవలం 5 శాతం వార్షిక వడ్డీ మాత్రమే విధించబడుతుంది. ఇది మార్కెట్ రేట్ల కంటే చాలా తక్కువ. వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి మరియు విక్రయించడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. లబ్ధిదారులకు ఆధునిక ఉపకరణాలను కొనుగోలు చేయడానికి రూ.15,000 వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, ప్రతి లావాదేవీకి రూ.1 చొప్పున ప్రోత్సాహకం అందించబడుతుంది.
అర్హత ప్రమాణాలు:
ఈ పథకం ద్వారా లబ్దిపొందే వారు భారతీయ పౌరులై ఉండాలి. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. సాంప్రదాయ కళలు లేదా చేతివృత్తులలో నిమగ్నమై ఉండాలి. గత ఐదేళ్లలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇలాంటి స్వయం ఉపాధి పథకాల కింద రుణం పొంది ఉండకూడదు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
ఈ పథకం కింద 18 రకాల సాంప్రదాయ వృత్తులు, కళలు గుర్తించారు.. వాటిలో వడ్రంగులు, కుమ్మరులు, బుట్టలు అల్లేవారు, చాపలు తయారుచేసేవారు,బొమ్మలు తయారుచేసేవారు, తాళాలు తయారుచేసేవారు, స్వర్ణకారులు, శిల్పులు, చర్మకారులు, చేనేత కార్మికులు, ఇతర సాంప్రదాయ వృత్తులవారు ఈ పథకానికి అర్హులు.
పథకం అమలు:
ఈ పథకాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న , మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME) అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు , ఇతర భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. ఈ పథకం గురించి మరింత సమాచారం కోసం, మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications