RVNL దూకుడు.. రూ 97 వేల కోట్లకు చేరిన ఆర్డర్లు!
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) దూసుకుపోతుంది. FY25 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే రూ. 25,000 కోట్ల విలువైన ఆర్డర్లను (LOA + L1) దక్కించుకుని మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. డిసెంబర్ 2024 నాటికి, RVNL చేతిలో ఉన్న మొత్తం ఆర్డర్ల విలువ ఏకంగా రూ. 97,000 కోట్లకు చేరింది. ఈ మొత్తం, సంస్థ గత ఏడాది ఆదాయానికి 4.8 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.
గతవారం RVNL షేర్లు మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 6-లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూ. 554.64 కోట్ల విలువైన LOA పొందింది. విశాఖపట్నం పోర్ట్ రోడ్డును అనకాపల్లి-ఆనందపురం కారిడార్‌లోని సబ్బవరం బైపాస్ నుంచి శీలనగర్ జంక్షన్ వరకు అనుసంధానించే ఈ ప్రాజెక్ట్‌ను 730 రోజుల్లో పూర్తి చేయనున్నారు.

అంతేగాక, RVNL సౌత్ వెస్ట్రన్ రైల్వే నుంచి ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (EPC) ప్రాజెక్ట్‌ను కూడా దక్కించుకుంది. ఇందులో 2X25 KV OHE & PSI వ్యవస్థకు సంబంధించి డిజైన్, సరఫరా, ఎరక్షన్, టెస్టింగ్, కమీషనింగ్‌తో పాటు టెలికమ్యూనికేషన్, జనరల్ ఇంజినీరింగ్ పనులు ఉన్నాయి.
RVNL ఆర్డర్ బుక్‌లో 49% నామినేషన్ ప్రాజెక్టులు, 51% బిడ్డింగ్ ద్వారా పొందిన ఆర్డర్లు ఉన్నాయి. రైల్వేలు, నీటిపారుదల, విద్యుత్, మెట్రో వంటి రంగాల నుంచి కంపెనీకి పెద్ద ఎత్తున ఒప్పందాలు లభిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా RVNL దాదాపు రూ. 4,500 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
అయితే, ప్రస్తుత ప్రాజెక్టులు అనుమతుల కోసం వేచి ఉండటంతో FY25-26లో ఆదాయ వృద్ధి స్థిరంగా ఉండొచ్చని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అంచనా వేసింది. దీంతో RVNL యొక్క EPS అంచనాలను 3-7% తగ్గించడంతో పాటు, స్టాక్‌పై 'SELL' రేటింగ్‌ను కొనసాగించింది. అయితే శుక్రవారం ఈ స్టాక్ రూ. 361 వద్ద ముగిసింది. RVNL అద్భుతమైన ఆర్డర్ బుక్, విస్తరిస్తున్న ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియుతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications