వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిట్ కాయిన్లపై ఆర్బీఐ కొరడా, సొంత క్రిప్టో కరెన్సీ లక్ష్మీ!

|
Google Oneindia TeluguNews

ముంబై: వర్చువల్‌ కరెన్సీలపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. అదే సమయంలో బిట్‌ కాయిన్‌ల తరహాలో సొంత డిజిటల్‌ కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. బిట్‌ కాయిన్‌ వంటి వర్చువల్‌ కరెన్సీల కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులు, సంస్థలకు సేవలను మూడు నెలల్లోగా నిలిపి వేయాలని బ్యాంకులు, ఇతరత్రా నియంత్రణ సంస్థలను ఆదేశించింది. దీంతో క్రిప్టో కరెన్సీ వాడే వారికి బ్యాంకు సేవలు బంద్ కానున్నాయి.

Recommended Video

Bitcoins : బిట్ కాయిన్ అంటే అదన్నమాట !

వర్చువల్ కరెన్సీలు సహా సాంకేతిక వినూత్నతలు ఆర్థిక సంఘటితాన్ని పెంచే సామర్థ్యం ఉన్నవే. అయితే వర్చువల్ కరెన్సీలు లేదా క్రిఫ్టో కరెన్సీలు లేదా క్రిఫ్టో ఆస్తులు అనేవి వినియోగదారుల ప్రయోజనాలపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. అక్రమ మార్గాల్లో నగదు చలామణికి అవకాశం కల్పిస్తున్నాయి.

RBI bans Bitcoins, other virtual currencies, prohibits any dealing with banks

వినియోగదారులు, ట్రేడర్లు ఆర్బీఐకి తమ భయాలను చెబుతూ వస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా ఆర్బీఐ సాధ్యాసాధ్యాలపై పరిశోధన చేసి కొత్త డిజిటల్ కరెన్సీని తీసుకు రానుంది. వీటికి కేంద్ర బ్యాంకులు బాధ్యత వహిస్తాయి కాబట్టి నష్టం ఉండదు. కొన్ని మీడియా కథనాలు ప్రభుత్వం లక్ష్మి పేరుతో సొంత వర్చువల్ కరెన్సీని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు.

English summary
The Reserve Bank of India (RBI) on Thursday barred banks and financial institutions from dealing with virtual currencies including Bitcoins and said that it was time and again warning users of virtual currencies regarding the risks associated with it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X