Gold Loan: బంగారం లోన్ కు ఈఎంఐ చెల్లింపులు..!
సాధారణంగా హోం లోన్, పర్సనల్ లోన్ తీసుకుంటే.. నెలనెల ఈఎంఐ చెల్లిస్తాం. ఇలా చేయడం వల్ల రుణ గ్రహీతపై భారం తగ్గుతోంది. కానీ బంగారంపై లోన్ తీసుకుంటే ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించాలి. దీని వల్ల తీసుకున్న రుణం, వడ్డీ ఒకేసారి చెల్లించాల్సి వస్తుంది. అయితే బంగారం రుణాలను ఈఎంఐలో చెల్లిస్తే ఎలా ఉంటుంది. ఆర్బీఐ ఇదే ఆలోచన చేస్తోంది. పసిడి రుణాలకు ఈఎంఐ చెల్లింపులు ప్రవేశపెట్టే యోచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం రుణ దాతాలు( బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు) బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తున్నాయి. బంగారం వాల్యూలో కొంత శాతం వరకు రుణాలు ఇస్తారు. ఇది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల పై ఆధారపడి ఉంటుంది. పసిడిపై రుణాలు తీసుకునే వినియోగదారులకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ మాత్రమే ఉంది. అంటే రుణ కాల పరిమితి పూర్తయిన తర్వాత వడ్డీతో సహా రుణాన్ని చెల్లించాలి. కాల పరిమితి కంటే ముందు రుణం చెల్లిస్తే.. అప్పటి వరకు ఉన్న వడ్డీ, అసలు కలిపి చెల్లించవచ్చు. ఇది కూడా రుణ గ్రహీతలపై ఆధారపడి ఉంటుంది.

బంగారం ఈఎంఐ ఆప్షన్ ఉద్యోగం చేసే వారికి శుభవార్తగా చెప్పొచ్చు. ఎందుకంటే వారికి నెలనెల జీతం వస్తుంది కాబట్టి ఈఎంఐ చెల్లించడం సింపుల్ అవుతుంది. వ్యాపారాలు చేసే వారి వన్ టైమ్ పేమెంట్ మంచి ఆప్షన్ గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ బంగారంపై రుణాలపై ఈఎంఐ ఆప్షన్ తీసుకురావడానికి కారణం ఉన్నట్లు అంచనా వస్తున్నారు. పసిడి లోన్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆర్బీఐ పలు సందర్భాల్లో గుర్తించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రుణలు ఇచ్చే సంస్థలు వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తనిఖీలో తేలినట్లు తెలిసింది. ఈఎంఐ విధానం తీసుకొస్తే ఈ పద్ధతికి చెక్ పెట్టొచ్చని ఆర్బీఐ భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం దేశంలోని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సుమార్ రూ. 1.4లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను మంజూరు చేశాయి. గత సంవత్సరంతో పొలిస్తే ఇది14.6శాతం ఎక్కువ. పసిడిపై రుణాలు ఎక్కువ తీసుకోవడానికి వడ్డీ తక్కువగా ఉండడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. పర్సనల్ లోన్ పై వడ్డీ కంటే బంగారం లోన్ పై వడ్డీ తక్కువ ఉంటుందని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications