కారు ప్రియులకు గుడ్ న్యూస్! రెనో కార్లపై అదిరిపోయే ఆఫర్లు!!
ఇండియాలో బడ్జెట్ ధరలో లభించే స్టైలిష్ కార్లకు రెనో ఇండియా(Renault India) పెట్టింది పేరు. మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫిబ్రవరి నెలలో కొత్త కారు కొనాలనుకునే వారి కోసం సంస్థ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. తన పాపులర్ మోడల్స్ అయిన క్విడ్ హ్యాచ్‌బ్యాక్, కైగర్ ఎస్‌యూవీ, ట్రైబర్ MPVలపై ఏకంగా రూ.73,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. పెరుగుతున్న కార్ల ధరల మధ్య, ఈ స్థాయి తగ్గింపు కారు కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పవచ్చు.
రెనో కైగర్‌పై కాసుల వర్షం
రెనో నుంచి వచ్చిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV 'కైగర్' (Renault Kiger) ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్లను సొంతం చేసుకుంది. ఈ కారుపై మొత్తం రూ.73,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.48,500 నేరుగా నగదు తగ్గింపు రూపంలో ఉండగా.. మరో రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కింద, రూ.10,000 లాయల్టీ బోనస్ కింద లభిస్తున్నాయి. ప్రస్తుతం కైగర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.76 లక్షల నుంచి ప్రారంభమై రూ.10.34 లక్షల వరకు ఉంది. ఫీచర్లు, లుక్ పరంగా ఈ సెగ్మెంట్లో ఇది అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది.

బడ్జెట్ క్విడ్‌పై ఆకర్షణీయమైన తగ్గింపు
తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్న వారికి 'రెనో క్విడ్' ఒక వరమని చెప్పవచ్చు. ఈ నెలలో క్విడ్ మోడల్‌పై రూ.35,000 వరకు డిస్కౌంట్ ప్రకటించారు. నగదు తగ్గింపుతో పాటు పాత కారును మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. కేవలం రూ.4.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ హ్యాచ్‌బ్యాక్, ఇప్పుడు లభిస్తున్న ఆఫర్లతో మరింత చౌకగా మారనుంది. యువతను ఆకట్టుకునే డిజైన్, మోడరన్ ఫీచర్లు క్విడ్ ప్రధాన బలం.
పెద్ద కుటుంబాలకు ట్రైబర్ సరైన ఛాయిస్
ఇండియాలో అత్యంత చౌకగా లభించే 7-సీటర్ కారుగా 'రెనో ట్రైబర్' మంచి గుర్తింపు పొందింది. పెద్ద కుటుంబాలకు, దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ MPVపై కూడా ఫిబ్రవరి నెలలో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. రూ.5.76 లక్షల నుంచి ప్రారంభమయ్యే ట్రైబర్‌పై లాయల్టీ, ఎక్స్ఛేంజ్ బోనస్‌ల ద్వారా భారీగా ఆదా చేయవచ్చు. తక్కువ ధరకు 7 సీట్ల వసతి కల్పించడంలో ట్రైబర్‌కు సాటిలేదని వినియోగదారులు భావిస్తుంటారు.
వచ్చే నెలలో 'కొత్త డస్టర్' రాక
రెనో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్త ఏమిటంటే.. నెక్స్ట్ జనరేషన్ డస్టర్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. వచ్చే నెల మార్చిలో దీని ధరలను అధికారికంగా ప్రకటించనుంది. బోల్డ్ లుక్, అత్యాధునిక ఇంటీరియర్, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కొత్త డస్టర్, హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి, కొత్త వెర్షన్లకు దారి సుగమం చేయడానికి రెనో ఈ భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications