నక్క తోక తొక్కాడు.. పక్కనోడి డబ్బుతో పెట్టుబడి, 20 నిమిషాల్లో రూ.1.75 కోట్లు లాభం

ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశాడో.. ఓ వ్యక్తిని లక్ష్మీ దేవి ఊహించని విధంగా కటాక్షించింది.. లడ్డూ కావాలా నాయనా అన్నట్లు అనుకోకుండా అకౌంట్లో కోట్ల రూపాయల డబ్బు పడింది. మరో లడ్డూ కావాలా నాయనా అన్నట్లు ఆ డబ్బంతా స్టాక్ మార్కెట్లో పెట్టగా.. 20 నిమిషాల్లోనే సుడి తిరిగిపోయింది. కోట్ల కోట్ల డబ్బు అతనికి వచ్చి చేరింది. అయితే ఇది కల కాదు... లాటరీ కాదు... పూర్తిగా ఒక సాంకేతిక లోపం ఫలితం. ఆ పొరపాటు కేవలం నిమిషాల్లోనే స్టాక్‌ మార్కెట్‌లో కోట్ల లాభంగా మారి, చివరికి న్యాయస్థానం మెట్లెక్కింది.

స్టాక్‌ మార్కెట్‌లో సాంకేతిక లోపాలు ఎంతటి అనూహ్య పరిణామాలకు దారి తీస్తాయో చెప్పే అరుదైన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ టెక్నికల్ గ్లిచ్‌ కారణంగా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన రూ.40 కోట్లు అనుకోకుండా ఓ ట్రేడర్‌ ఖాతాలో జమ చేసింది. తన అకౌంట్లో అంత డబ్బు డిపాజిట్ కావడంతో అతడు షాక్ అయ్యాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చిన డబ్బు మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు. అంతే అతడు పొద్దునే లేచి ఎవరి ముఖం చూశాడో గాని సుడి తిరిగిపోయింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే రూ.1.75 కోట్ల లాభాన్ని ఆర్జించాడు. అతడు పెట్టిన పెట్టుబడి 20 నిమిషాల తర్వాత వచ్చిన లాభంతో కలుపుకుని రూ.41.75 కోట్లు. కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఈ న్యూస్ బయటకు రాగా.. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

Rs 40 Crore Trading Error at Kotak Securities Ends with Landmark Bombay High Court Verdict

క్లయింట్ ఖాతాలో పొరపాటున..

ఈ ఘటన 2022లో చోటుచేసుకుంది. కోటక్ సెక్యూరిటీస్‌ ట్రేడింగ్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల, సంస్థకు చెందిన రూ.40 కోట్లు ఒక క్లయింట్ ఖాతాలో పొరపాటున జమైంది. ఖాతాలో వచ్చిన డబ్బు మొత్తాన్ని గమనించిన ట్రేడర్‌, దానిని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. మార్కెట్ లాభాల్లో ఉండటంతో అతడికి క్షణాల్లోనే కోట్ల రూపాయల లాభం లభించింది. తరువాత తమ సిస్టమ్‌లో జరిగిన లోపాన్ని గుర్తించిన కోటక్ సెక్యూరిటీస్‌ వెంటనే ట్రేడర్‌ను సంప్రదించింది. ఈ క్రమంలో ఖాతాలో జమ అయిన రూ.40 కోట్ల అసలు మొత్తాన్ని ట్రేడర్‌ సంస్థకు తిరిగి చెల్లించాడు. అయితే, ఆ డబ్బును వినియోగించి సంపాదించిన రూ.1.75 కోట్ల లాభాన్ని కూడా తమకే ఇవ్వాలని కోటక్‌ డిమాండ్‌ చేయడంతో వివాదం చెలరేగింది. ట్రేడర్‌ దీనికి అంగీకరించకపోవడంతో ఇరు పక్షాలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి.

నష్టం ఏమీ జరగలేదు..

ఈ కేసుపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రేడర్‌ సంపాదించిన రూ.1.75 కోట్ల లాభం అతడికే చెందుతుందని స్పష్టం చేసింది. ఆ డబ్బు అన్యాయంగా లేదా అక్రమంగా సంపాదించిందేమీ కాదని, ట్రేడర్‌ తన స్వంత రిస్క్‌పై మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినందున లాభం కూడా అతడికే చెందుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ లావాదేవీ వల్ల కోటక్ సెక్యూరిటీస్‌కు ప్రత్యక్ష నష్టం ఏమీ జరగలేదని కోర్టు పేర్కొంది.

ట్రేడర్‌కు రూ.50 లక్షలు ఆఫర్..

విచారణ సమయంలో, లాభాన్ని సంస్థకు అప్పగిస్తే ట్రేడర్‌కు రూ.50 లక్షల పరిహారం ఇస్తామని కోటక్ సెక్యూరిటీస్‌ ప్రతిపాదన చేసింది. అయితే, ట్రేడర్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేస్తున్నట్లు బాంబే హైకోర్టు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+