డాలర్‌తో జీవితకాల కనిష్టస్థాయికి పతనమైన రూపాయి
ముంబై: డాలర్‌తో రూపాయి విలువ గురువారం మరింత పడిపోయింది. డాలర్ మారకంతో రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 68.89తో ప్రారంభమైంది.
ఇది రూపాయి చరిత్రలోనే అత్యంత తక్కువ. తర్వాత మరింత క్షీణించి 69.01 వరకు వెళ్లింది. 69 మార్కును దిగిపోవడం కూడా ఇదే ప్రథమం. బ్యాంకులు, చమురు దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడడంతో రూపాయి పతనాన్ని చవిచూసింది.

24 నవంబర్ 2016లో రూపాయి విలువ డాలర్‌తో 68.8650 రికార్డుగా ఉంది. బుధవారం డాలర్‌తో రూపాయి 37 పైసలు తగ్గి 19 నెలల కనిష్ట స్థాయిలో 68.61 వద్ద ముగిసింది. గురువారం మరింత బలహీనత కనిపించింది.












Click it and Unblock the Notifications