మరింత క్షీణించిన రూపాయి మారకం: రూ.72.66
Recommended Video

ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం మరింత క్షీణించింది. డాలర్‌కు డిమాండ్ పెరిగిపోతుండటంతో పాటు, ముడి చమురు ధరలు పెరగడం, కరెంట్ ఖాతా లోటు ఎక్కువగా ఉండటం రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఊహించని విధంగా పతనమవుతోంది.
సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ 88 పైసలు నష్టపోయి 72.66 వద్ద జీవనకాల అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. క్రితం సెషన్‌లో 71.73 వద్ద ముగిసిన రూపాయి.. సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీగా పతనమైంది.

72.18 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 72.61 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ చరిత్రలో రూపాయి విలువ ఇంతటి కనిష్ఠస్థాయిలో ఉండటం ఇదే తొలిసారి.
ఇది ఇలావుంటే, రూపాయి క్షీణత దేశీయ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చమురు ధరలు, రూపాయి పతనంతో ఆరంభం నుంచే నష్టాల బాట పట్టిన సూచీలు మధ్యాహ్నానికి కుప్పకూలాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లకు పైగా కోల్పోయింది.
ప్రస్తుతం 363 పాయింట్లు నష్టపోయి 38,028 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 118 పాయింట్ల నష్టంతో 11,471 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా, పెట్రో ధరల పెరుగుదల, రూపాయి క్షీణతపై కాంగ్రెస్ తోపాటు విపక్షాలు సోమవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications