Rupee: ఊపుమీదున్న రూపాయి.. ఒక్క రోజే ఏకంగా 23 పైసలు జంప్

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఒడుదొడుకుల నడుమ భారత కరెన్సీ రూపాయి శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌లో కాస్త కోలుకుని ఊపిరి పీల్చుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 23 పైసలు పుంజుకుని 96.65 వద్ద ట్రేడైంది. గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ స్వల్పంగా బలహీనపడటంతో పాటు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మార్కెట్‌లో స్వల్పంగా జోక్యం చేసుకుని డాలర్లను విక్రయించడం రూపాయికి బాగా కలిసివచ్చిందని కరెన్సీ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఉపశమనం!

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గడం కూడా రూపాయి రికవరీకి ప్రధాన కారణంగా నిలిచింది. ఇరాన్‌పై దాడికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలతో ముడిచమురు బారెల్ ధర 103.14 డాలర్ల వద్దకు చేరింది. దీనికి తోడు 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలాన్ని తెలిపే డాలర్ ఇండెక్స్ 0.10 శాతం తగ్గి 102.03 పాయింట్ల వద్ద ట్రేడవ్వడం దేశీయ కరెన్సీకి తాత్కాలికంగా ఊరటనిచ్చింది.

Rupee Gains 23 Paise to 96 65 Against US Dollar Driven by RBI Support and Lower Crude Oil Prices
రూపాయిలో స్వల్ప మార్పు.. మూడు పైసలతో నేటి ప్రయాణం ప్రారంభం
రూపాయిలో స్వల్ప మార్పు.. మూడు పైసలతో నేటి ప్రయాణం ప్రారంభం

విదేశీ నిధుల తరలింపు.. ఇంకా తగ్గని ఒత్తిడి!

తాత్కాలికంగా రూపాయి లాభపడినప్పటికీ, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను నిరంతరం వెనక్కి తీసుకోవడం కరెన్సీపై ఒత్తిడి తెస్తోంది. గురువారం ఒక్కరోజే విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 12,943.58 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. విదేశీ నిధుల తరలింపు, చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు ఉన్న విపరీతమైన డిమాండ్ వల్ల రూపాయి లాభాలు కొంతవరకు పరిమితమయ్యే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

RBI: ఒక్క దెబ్బతో లక్ష కోట్లు! బ్యాంకింగ్ రంగంలో కరెన్సీ సునామీ..
RBI: ఒక్క దెబ్బతో లక్ష కోట్లు! బ్యాంకింగ్ రంగంలో కరెన్సీ సునామీ..

స్టాక్ మార్కెట్ల జోష్!

అటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సైతం సానుకూల ధోరణి కనిపిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 71,876 పాయింట్ల వద్ద కొనసాగగా.. నిఫ్టీ 84.60 పాయింట్లు పెరిగి 22,310 పాయింట్ల వద్ద ట్రేడైంది. స్టాక్ మార్కెట్లలో కనిపించిన ఈ సానుకూల వాతావరణం కూడా రూపాయి కోలుకోవడానికి మరింత బలాన్ని చేకూర్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+