Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూల్ సెల్ఫీస్: అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తోన్న ఒప్పో F9 ప్రో స్మార్ట్ ఫోన్

మొబైల్ ఫోన్ల వినియోగంలో మనం చాలా వరకు చేరుకున్నాం. 2003లో ఫ్లిప్ మొబైల్ ఫోన్‌ పరిచయం అయ్యింది. ఇది 0.3 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఈ ఫ్లిప్ మొబైల్ ఆవిష్కరణతోనే ఫ్రంట్ ఫేస్ కెమెరా ఉన్న తొలి మొబైల్ ఫోన్ ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలంటూ ఇది ప్రపంచాన్ని ఊపేస్తుందంటూ తొలిసారిగా ఈ ఫోన్‌ను రూపొందించిన డిజైనర్లు ఊహించి ఉండరు. ఇక సోషల్ మీడియా సెల్ఫీ వీడియోలతో నిండిపోయాయి. ప్రతి చిన్న విషయం సెల్ఫీ వీడియోనో లేక ఫోటోనో తీసి నెటిజెన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.దీంతో 2013లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సెల్ఫీ అనే పదాన్ని ఆ ఏడాది ఉత్తమ పదంగా అభివర్ణించింది. ఈ సెల్ఫీలతో ప్రతి ఒక్కరూ మోడల్‌గా తయారయ్యారు. ఒక ఫోటోగ్రాఫర్‌గా మారారు. ఒక డైరెక్టర్ అయ్యారు.

Selfies Are Cool, But How About Smartphones That Are As Vibrant As Fabric?

ప్రస్తుతం మనం 2000వ దశకంలో లేము. ఇప్పుడు 2018 నడుస్తోంది. ఇప్పుడు వస్తున్న ఫ్రంట్ ఫేస్ కెమెరాలు అత్యద్భుతంగా ఉంటున్నాయి. ఇక ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తున్నామంటే దాని ఫ్రంట్ కెమెరా ఫీచర్స్ ఏమిటి... ఎంత రిజల్యూషన్‌తో వస్తోంది... సెల్ఫీ తీసుకుంటే పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుందని అడిగి మరీ కొంటున్నాం. ఇక యాప్స్ విషయాలు అంత పట్టించుకోకపోయినప్పటికీ మిగతా ఎక్స్‌ట్రా ఫీచర్స్ గురించి ఆలోచిస్తున్నాం. ఇలాంటి ఫీచర్స్‌తో పాటు పిచ్చ కెమెరా క్లారిటీతో కొత్త ఒప్పో F9 ప్రో వచ్చింది.

Selfies Are Cool, But How About Smartphones That Are As Vibrant As Fabric?

కొత్త ఒప్పో F9 ప్రో ఈ ఆగష్టులోనే మార్కెట్లోకి లాంచ్ కానుంది. మార్కెట్లోకి రాకముందే ఈ మొబైల్ ఫోన్ సంచలనాలను సృష్టిస్తోంది. ఇందులో ఎడ్జ్-ఎడ్జ్ వాటర్ డ్రాప్ డిస్ప్లే మొబైల్ లవర్స్‌ను కట్టిపడేస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ 90.8శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తోంది. ఒప్పో F9 ప్రో vooc ఫ్లాష్ ఛార్జ్ కేపబులిటీతో వస్తోంది. అంటే కేవలం ఐదు నిమిషాలు బ్యాటరీ ఛార్జింగ్ పెడితే మీరు రెండుగంటల పాటు నాన్‌స్టాప్‌గా మాట్లాడుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒప్పో F9 ప్రో లుక్ సూపర్‌గా ఉంది. మూడు బేసిక్ కలర్స్‌లో ఫోన్ లభ్యమవుతోంది. స్టారీ పర్పుల్, సన్‌రైజ్ రెడ్, ట్విలైట్ బ్లూ కలర్స్‌లో ఫోన్ లభ్యమవుతోంది. దీనికి అదనంగా రెడ్ మరి బ్లూ కలర్‌లో వచ్చే ఫోన్లలో వెనకాల డైమండ్స్ రూపంలో ఉండేలా డిజైన్ చేశారు. మరోవైపు పర్పుల్ కలర్ ఫోన్‌లో స్టార్స్ ఉండేలా డిజైన్ చేశారు.

Selfies Are Cool, But How About Smartphones That Are As Vibrant As Fabric?

ఇక ఒప్పోతో ఉన్న ఒప్పందంలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ అరోరా ప్రత్యేకంగా ఒప్పో F9 ప్రో ఫోన్లకోసం ప్రత్యేక కలర్స్ రూపొందించనున్నారు. ఒప్పో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ మాట్లాడుతూ ... మనీష్ ఇచ్చే డిజైన్స్‌తో పాటు ఈ ఫోన్ ఫీచర్స్ క్రేజీ కాంబినేషన్ క్రియేట్ చేస్తుందన్నారు. ఇప్పటికే ఒప్పో సంస్థ నుంచి వచ్చే ఫోన్లను సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌గా ప్రమోట్ చేసుకుంటోంది. యువత ఫ్యాషన్ వైపు అడుగులు వేస్తున్నారని గ్రహించిన కంపెనీ... వారిని దృష్టిలో ఉంచుకుని ఒప్పో F9 ప్రోను డిజైన్ చేసింది. ఒప్పో F9 ప్రో నుంచి మొబైల్ లవర్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌ను ఆశించవచ్చు. ప్రాసెసర్ నుంచి మొదలుకొని... ఛార్జింగ్, కెమెరాలలో అత్యున్నత ప్రమాణాలతో ఒప్పో F9 ప్రో వస్తోంది. ప్రస్తుతం సెల్ఫీ కెమెరా స్పెసిఫికేషన్స్ కోసమే యువత ఆరాటపడటం లేదు... ఫీచర్స్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లుక్ వరకు అన్నీ నాణ్యమైన ప్రమాణాలతో కావాలని కోరుకుంటున్నారు. అటువంటి వారికి ఒప్పో F9 ప్రో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+