రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేసిన మార్కెట్లు
గతకొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాల బాట నడుస్తున్నాయి. సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రారంభం నుంచే ఉత్సాహంగా సాగిన సూచీలు చివరి వరకూ అదే ఊపును కొనసాగించాయి. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో పయనించడంతో సోమవారం మార్కెట్లు కళకళలాడాయి. రికార్డు స్థాయిలో లాభపడ్డాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో ప్రారంభంకాగా... నిఫ్టీ 57 పాయింట్లతో ప్రారంభమైంది. ఒకానొక దశలో ఎప్పుడూ లేనంతగా నిఫ్టీ రికార్డు క్రియేట్ చేస్తూ 11వేల 424 పాయింట్లకు చేరింది. చివరకు సెన్సెక్స్ 135.73 పాయింట్ల లాభంతో 37691.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.30 పాయింట్ల లాభంతో 11387.10 వద్ద ముగిసింది. వర్షాకాలం చివరలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ గత వారం వెల్లడించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతోంది.

ఇదిలా ఉంటే సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో బ్యాంకుల షేర్లు లాభాల్లో పయనించాయి. ఆ తర్వాత ఆటో, స్టీల్, రంగాల షేర్లు ప్రాఫిట్ నమోదు చేశాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతి ఎయిర్‌టెల్, యూపీఎల్ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. గెయిల్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, కొటక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, హెచ్‌యూఎల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.78వద్ద ట్రేడవుతోంది.యూరోప్, ఇతర ఆసియా దేశాల్లో షేర్లు లాభాలు నమోదు చేయడంలో మందగించాయి. ఇ:దుకు కారణం అమెరికా చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications