Stock Market : మార్కెట్ కళకళ.. సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు! ఇన్వెస్టర్ల పండగ!!

వరుసగా ఐదవ రోజు కూడా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ , నిఫ్టీ సూచీలు రెండూ కూడా ఉత్సాహంగా ట్రేడింగ్ ముగించాయి. రూపాయి బలం పుంజుకోవడం, విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) అమ్మకాలు తగ్గించడం, ఇంకా సమాచార సాంకేతిక (IT) రంగం షేర్లు మళ్లీ పుంజుకోవడం వంటి కారణాల వల్ల మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది.

నిఫ్టీ 50 సూచీ అయితే ఏకంగా 23,400 మార్కును కూడా తాకింది! గత రెండు నెలల్లో ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. గత వారం రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్లో కనిపిస్తున్న ఈ టర్న్‌అరౌండ్‌కు ప్రధాన కారణం విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మారడమే. నెల రోజుల పాటు అమ్మకాలు చేసిన FIIలు గత మూడు సెషన్లలో రెండు సార్లు కొనుగోలుదారులుగా మారారు.

sensex-nifty-surge-as-market-sentiment-turns-positive

మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు..
మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 557.45 పాయింట్లు పెరిగి 76,905.51 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159.75 పాయింట్లు లాభంతో 23,350.40 వద్ద ముగిసింది. మార్కెట్లో కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపించింది. మొత్తం 2,684 స్టాక్‌లు లాభపడగా, 1,179 స్టాక్‌లు నష్టపోయాయి. 118 స్టాక్‌లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక వారం మొత్తం చూసుకుంటే, నిఫ్టీ 50, సెన్సెక్స్ రెండూ కూడా 4 శాతానికి పైగా పెరిగాయి. గత నాలుగేళ్లలో ఇదే అత్యుత్తమ వారం అని విశ్లేషకులు వెల్లడించారు.

లాభపడ్డ & నష్టపోయిన స్టాక్స్ ఇవే!
సెక్టార్ల వారీగా చూస్తే, 13 ప్రధాన రంగాల సూచీలలో 11 లాభాల్లో ముగిశాయి. నిఫ్టీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్ , బీపీసీఎల్ వంటి స్టాక్‌లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఒక్కో స్టాక్ దాదాపు 3 శాతం వరకు పెరిగింది. మరోవైపు ఎం&ఎమ్, విప్రో, హిందాల్కో ,ఇన్ఫోసిస్ స్టాక్‌లు 1-2 శాతం వరకు పడిపోయి నష్టపోయిన స్టాక్‌లుగా నిలిచాయి.

మార్కెట్ జోష్‌కు రూపాయి విలువ వరుసగా ఎనిమిదవ సెషన్‌లో కూడా పెరగడం సానుకూల సెంటిమెంట్‌ను మరింత పెంచింది. ఇది ఈక్విటీ మార్కెట్లోకి పెట్టుబడులు పెరగడానికి దోహదపడింది. అంతేకాకుండా, మార్కెట్ పడిపోయిన తర్వాత లార్జ్-క్యాప్ స్టాక్‌ల వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా ఉండటం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ప్రస్తుతం మనం చూస్తున్నది ఒక తాత్కాలిక ర్యాలీ మాత్రమే. ఇది 23,300-23,500 స్థాయిల వరకు కొనసాగవచ్చు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+