Silver Price: వెండి రేటును శాసిస్తుంది ఎవరు?
వెండి.. మార్కెట్ చరిత్ర తిరగరాసింది. ఔన్సుకు 88.37 డాలర్ల వద్ద ట్రేడవుతూ వెండి తన చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసింది. కేవలం 13 నెలల వ్యవధిలోనే వెండి ధరలు 210 శాతం పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ర్యాలీలో వెండి, బంగారం, ప్లాటినం వంటి ఇతర విలువైన లోహాలను కూడా వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే 2026లో వెండి లోటు ఎంత తీవ్రం అవుతుంది? సిల్వర్ రేట్లను నియంత్రిస్తున్న అదృశ్య శక్తి ఎవరు?
మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం 2026లో ప్రపంచవ్యాప్తంగా వెండి లోటు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2025లోనే 110-120 మిలియన్ ఔన్సులకు పైగా లోటు నమోదవుతుందని అంచనాలు ఉన్నాయి. 2026లో ఇది ఇంకా పెరిగి 130-150 మిలియన్ ఔన్సుల వరకు చేరే ప్రమాదం ఉందని కొందరు కమోడిటీ నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం పారిశ్రామిక డిమాండ్ వేగంగా పెరుగుతుండగా, గనుల ఉత్పత్తి మాత్రం అంత వేగంగా పెరగకపోవడమే.

రికార్డ్ స్థాయిలో వినియోగం..
సౌర విద్యుత్ రంగం, ఎలక్ట్రిక్ వాహనాలు, AI & డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, హైటెక్ తయారీ పరిశ్రమల్లో వెండి వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. మరోవైపు, మెక్సికో, పెరూ, చైనా వంటి ప్రధాన ఉత్పత్తి దేశాల్లో కొత్త గనుల ప్రారంభం మందగించడం, పాత గనుల్లో ఉత్పత్తి తగ్గడం సరఫరాను కట్టడి చేస్తున్నాయి. ఫలితంగా సరఫరా డిమాండ్ మధ్య అంతరం ప్రతి సంవత్సరం పెరుగుతోంది.
ప్రధాన అదృశ్య శక్తి..
వెండి ధరలను ప్రభావితం చేస్తున్న ప్రధాన అదృశ్య శక్తి.. ఫిజికల్ డిమాండ్ + ఫ్యూచర్స్ మార్కెట్ కలయిక. ఒక వైపు భౌతిక వెండికి (సిల్వర్ బార్స్, కాయిన్స్, ఇండస్ట్రియల్ యూజ్) డిమాండ్ భారీగా పెరుగుతుండగా, మరోవైపు ఫ్యూచర్స్ & ETF ట్రేడింగ్ ధరల అస్థిరతను వేగంగా పెంచుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో పెద్ద పరిమాణంలో వెండిపై బెట్టింగ్ చేయవచ్చా లేదా అనేది ధర్మ సందేహంగా మారింది. దీంతో చిన్న జియో పాలిటికల్ వార్తలు కూడా భారీ ధరల కదలికలకు కారణమవుతున్నాయి.
దీనికి తోడు డాలర్ బలహీనత, వడ్డీ రేట్లపై అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల విధానాలు, అంతర్జాతీయ టెన్షన్స్ కూడా వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే విశ్లేషకులు ఇప్పుడు ఒకేటే చెప్పున్నారు.. వెండి ధరలు ఇప్పుడు కేవలం ఒక లోహంలా చూడకుడదని. అది ప్రపంచ ఆర్థిక భయాలకు అద్దంలా మారబోతుందంటూ జోస్యం చెప్తున్నారు.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications