రాత్రికి రాత్రే కోటీశ్వరులు! ఉద్యోగులకు జాక్‌పాట్

రాత్రికి రాత్రే అదృష్టం తలుపు తడితే ఎలా ఉంటుందో చెప్పడానికి లాటరీ టికెట్లే అవసరం లేదు, ఒక మంచి ఐడియా ఉన్న కంపెనీలో నమ్మకంగా పనిచేస్తే చాలని నిరూపించింది ఒక అద్భుత పరిణామం. నెలాఖరైతే జీతం కోసం ఎదురుచూసే సాధారణ ఆఫీస్ సిబ్బంది, క్యాంటీన్ వర్కర్లు, క్లీనింగ్ స్టాఫ్.. ఇప్పుడు ఒక్కసారిగా ఊహించని రీతిలో వందల కోట్ల అధిపతులుగా మారిపోయారు. కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఈ 'వెల్త్ విప్లవం'తో వేలాది మంది మధ్యతరగతి ఉద్యోగుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి.

ఈ కళ్లు చెదిరే అద్భుతానికి కారణం.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ (IPO)కి సిద్ధమవడమే. నాస్‌డాక్ (Nasdaq) స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టబోతున్న ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీలో పనిచేసే సుమారు 4,400 మంది సాధారణ ఉద్యోగులు ఒకేసారి మల్టీ-మిలియనీర్లు కాబోతున్నారు.

SpaceX IPO Success Thousands of Everyday Employees Become Instant Millionaires as Stock Options Skyrocket

ఇంజనీర్లకే కాదు.. క్యాంటీన్ సిబ్బందికీ జాక్‌పాట్!

స్పేస్‌ఎక్స్ కంపెనీ మొదటి నుండి తమ ఉద్యోగులకు భారీ జీతాలు ఇవ్వడానికి బదులుగా.. కంపెనీ ఈక్విటీ షేర్లను (Stock Options) ప్రోత్సాహకాలుగా ఇస్తూ వచ్చింది. గతంలో కేవలం $2కే లభించిన ఈ షేర్ల విలువ ఇప్పుడు ఐపీఓ పుణ్యమా అని ఏకంగా $135కి చేరింది. దీంతో కంపెనీలోని వైట్-కాలర్ ఇంజనీర్లతో పాటు క్యాంటీన్ కార్మికులు, క్లీనింగ్ స్టాఫ్, రికవరీ బోట్ సిబ్బంది కూడా కోటీశ్వరుల జాబితాలో చేరిపోతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం, సుమారు 400 మంది ఉద్యోగుల ఆస్తి విలువ ఏకంగా 100 మిలియనీర్ డాలర్లు (రూ. 830 కోట్లు) దాటబోతోంది.

సాధారణ బోట్ వర్కర్.. నేడు మిలియనీర్!

షేర్ల మాయాజాలానికి 27 ఏళ్ల మేరీఎలిన్ ముస్సెల్మన్ కథే ఒక ఉదాహరణ. ఫ్లోరిడా తీరంలో రాకెట్ భాగాలను సేకరించే స్పేస్‌ఎక్స్ రికవరీ నౌకలో ఆమె ఒక సాధారణ ఇంజనీరింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. సాధారణంగా నావికులకు కంపెనీ షేర్లు లభించడం అరుదు. కానీ ఆమె తనకు లభించిన స్టాక్ ఆప్షన్లతో పాటు, ప్రతి నెలా తన జీతంలో 10 శాతాన్ని కంపెనీ షేర్లలోనే దాచుకున్నారు. నేడు ఐపీఓతో ఆమె ఓవర్‌నైట్ మిలియనీర్‌గా మారి, తన సొంత రిపేర్ బిజినెస్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

$1.8 ట్రిలియన్ల అంతరిక్ష సామ్రాజ్యం

స్పేస్‌ఎక్స్ తన ఐపీఓ ద్వారా సుమారు 75 బిలియన్ డాలర్ల మూలధనాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లెక్కన కంపెనీ మొత్తం మార్కెట్ విలువ దాదాపు 1.8 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 150 లక్షల కోట్లు) చేరుకోనుంది. వాల్ స్ట్రీట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓగా నిలవబోతున్న ఈ షేర్ల కోసం మార్కెట్లోకి రాకముందే రికార్డు స్థాయిలో 250 బిలియన్ డాలర్ల ముందస్తు డిమాండ్ రావడం గమనార్హం.

వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థల క్యూ.. రియల్ ఎస్టేట్ జోరు

ఒకేసారి వేలాది మంది ఉద్యోగుల చేతికి బిలియన్ల కొద్దీ నగదు రాబోతుండటంతో, వారి పెట్టుబడులను ప్లాన్ చేయడానికి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సంస్థలు రంగంలోకి దిగాయి. మరోవైపు, ఈ కొత్త మిలియనీర్ల ధాటికి స్పేస్‌ఎక్స్ ప్రధాన కార్యకలాపాలు సాగుతున్న సౌత్ టెక్సాస్ (బోకా చికా) ప్రాంతంలో లగ్జరీ ఇళ్లకు, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగినట్లు స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు.

ఎలాన్ మస్క్.. ప్రపంచపు తొలి 'ట్రిలియనీర్'?

ఈ చారిత్రాత్మక ఐపీఓ ద్వారా స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి 'ట్రిలియనీర్' (లక్ష కోట్ల డాలర్ల అధిపతి)గా అవతరించబోతున్నట్లు బ్లూమ్‌ బర్గ్ నివేదించింది. అయితే, కంపెనీ ఎప్పటికీ పబ్లిక్ లిస్టింగ్ కాదని భావించి, గతంలో తమ షేర్లను చిన్న మొత్తాలకు అమ్మేసుకున్న కొందరు ఉద్యోగులు ఇప్పుడు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. SpaceX సాధించిన ఈ అసాధారణ విజయం, రాబోయే రోజుల్లో స్టార్‌లింక్, ఏఐ (AI) మౌలిక సదుపాయాల విస్తరణకు మరింత ఊతాన్ని ఇవ్వనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+