PPF + సుకన్య సమృద్ధి.. ఈ రెండూ కలిపి వాడితే మైండ్ బ్లాక్ ప్రాఫిట్!

తల్లిదండ్రులుగా మన పిల్లల భవిష్యత్తును సురక్షితంగా మార్చడం కోసం పడే తపన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కూతురి చదువు, పెళ్లి లేదా ఇతర దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బు ఎక్కడ దాచుకోవాలనే ఆలోచన ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. ప్రభుత్వ భద్రతతో కూడిన పథకాల్లో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (PPF), 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) ముందుంటాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ దాంట్లో లాభాలు ఎక్కువ? అనే విషయాలపై క్లారిటీ లేక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ రెండు ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలే అయినప్పటికీ, వీటి వయస్సు పరిమితి, కాలపరిమితి, వడ్డీ రేట్లు, డబ్బు వెనక్కి తీసుకోవడంలో ఉండే రూల్స్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన (SSY) పై 8.2 శాతం వడ్డీ లభిస్తుండగా, పీపీఎఫ్ (PPF) పై 7.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. అయితే ఎస్ఎస్‌వైలో ఎక్కువ వడ్డీ వస్తున్నప్పటికీ, డబ్బు డ్రా చేసుకునే నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయని బ్యాంక్‌బజార్ సీఈఓ అధిల్ శెట్టి వెల్లడించారు. కూతురి వయస్సు, పెట్టుబడి పెట్టే కాలం, భవిష్యత్తు అవసరాల ఆధారంగా ఏ పథకాన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

Sukanya Samriddhi or PPF for Daughter s Future Corpus Key Rules Interest Rates and Withdrawal Norms

సుకన్య సమృద్ధి యోజన (SSY): ఎక్కువ వడ్డీ.. కానీ ఆంక్షలు ఎక్కువే!

10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల పేరు మీద ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ అవుతుంది. అయితే కేవలం మొదటి 15 ఏళ్లపాటు మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపై 8.2 శాతం వడ్డీ లభిస్తుండటం విశేషం. కూతురి భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా పెద్ద నిధిని ఏర్పాటు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది చక్కటి ఆప్షన్.

డబ్బు ఎప్పుడు, ఎలా వెనక్కి తీసుకోవచ్చు?

ఎస్ఎస్‌వై ఖాతా నుంచి మనకు ఎప్పుడు పడితే అప్పుడు సాధారణ సేవింగ్స్ ఖాతాలాగా డబ్బులు డ్రా చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే ఉన్న బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇది ఉన్నత చదువుల ఖర్చుల కోసం అనుమతించబడుతుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతలవారీగా తీసుకోవచ్చు. ఒకవేళ అమ్మాయికి వివాహం జరిగినా లేదా అత్యంత క్లిష్టమైన ఆర్థిక ఇబ్బందులు, ఖాతాదారుని మరణం వంటి ప్రత్యేక సందర్భాల్లో మెచ్యూరిటీకి ముందే ఖాతాను క్లోజ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

సూపర్ స్కీమ్: రూ.70 లక్షల పైగా రాబడి!
సూపర్ స్కీమ్: రూ.70 లక్షల పైగా రాబడి!

పీపీఎఫ్ (PPF): ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ.. ఎప్పుడైనా ఆపొచ్చు!

పీపీఎఫ్ విషయానికి వస్తే దీని కాలపరిమితి 15 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఐదేళ్ల బ్లాకులుగా దీన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా నిర్దిష్ట కాలం తర్వాత రుణాలు తీసుకునే వెసులుబాటు, పాక్షిక ఉపసంహరణలకు కూడా ఇది అనుమతిస్తుంది. ఖాతా ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత నుంచి వైద్య చికిత్సలు, పిల్లల లేదా మన చదువులు, అలాగే నివాస హోదా మారిన సందర్భాల్లో ముందస్తు క్లోజింగ్‌కు వెసులుబాటు ఉంటుంది. కూతురి కోసమే కాకుండా కుటుంబం యొక్క ఇతర దీర్ఘకాలిక అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని భావించే వారికి పీపీఎఫ్ మంచి ఎంపిక అవుతుంది.

2.5 లక్షలకు PPF లిమిట్ ?- ఆర్థికమంత్రికి సాయిరెడ్డి కీలక ప్రతిపాదన..!
2.5 లక్షలకు PPF లిమిట్ ?- ఆర్థికమంత్రికి సాయిరెడ్డి కీలక ప్రతిపాదన..!

చివరిగా ఏది బెస్ట్? ఏది ఎంచుకోవాలి?

కేవలం కూతురి భవిష్యత్తు కోసమే ప్రత్యేకంగా ఎక్కువ వడ్డీతో కూడిన నిధిని ఏర్పాటు చేయాలనుకుంటే 'సుకన్య సమృద్ధి యోజన' వైపు వెళ్లడం మంచిది. అయితే నిధులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోరుకునే వారికి పీపీఎఫ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకవేళ ఆర్థికంగా స్థిరంగా ఉన్న తల్లిదండ్రులు ఈ రెండింటినీ వేర్వేరుగా ఉపయోగించుకోవచ్చు. కూతురి కోసం ఎస్ఎస్‌వైలో మదుపు చేస్తూనే, కుటుంబ ఇతర దీర్ఘకాలిక అవసరాల కోసం పీపీఎఫ్‌ను కూడా కొనసాగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+