సన్ టీవీ నెట్ వర్క్ గోవిందా..!!
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కు పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళన వెట్రి కజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేదీ అదే పరిస్థితి.
ఈ ఎన్నికల్లో అతి పెద్ద సంచలనం.. టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనపర్చడం. ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేసిన టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే రెండు, డీఎంకే మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ హంగ్ తప్పకపోవచ్చు. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్ల మెజారిటీ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేనట్టే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే.

ఈ ఎన్నికల్లో విజయ్ గెలుపు, డీఎంకే ఓటమి ప్రభావం.. సన్ టీవీ నెట్‌వర్క్ పై పడింది. ఆ సంస్థ షేర్లు తొమ్మిది శాతానికి పైగా పడిపోయాయి. సన్ టీవీ యజమాని మారన్ కుటుంబానికి అధికార డీఎంకేతో ఉన్న సంబంధాలు దీనికి కారణం. మధ్యాహ్నం 2:00 గంటల ప్రాంతంలో సన్ టీవీ షేర్ రూ. 563.50 వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 6.29 శాతం నష్టం కనిపించింది. మొత్తంా తొమ్మిది శాతం మేర నష్టపోయింది.
ఈ ఉదయం 611 రూపాయల వద్ద సన్ నెట్ వర్క్ షేర్ల ట్రేడింగ్ ఆరంభమైంది. ఆ వెంటనే 620 రూపాయల వరకు ఎగబాకింది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్లల్లో డీఎంకే ముందంజలో ఉంది. ఈవీఎంల లెక్కింపు ఆరంభం అయ్యే సమయానికి టీవీకే దూసుకొచ్చింది. దీంతో సన్ టీవీ నెట్ వర్క్ షేర్లు కుప్పకూలడం మొదలైంది. డీఎంకే ఓటమి ఖాయం అయ్యే సమయానికి రూ. 550. 80 పైసల వద్ద ట్రేడ్ అయింది ఒక్కో షేర్ ధర. ఆ తర్వాత కొద్దిగా కోలుకుని 568 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.












Click it and Unblock the Notifications