రూ.1.67 కోట్ల విలువైన "గోల్డెన్ బైక్".. కేవలం పెయింట్స్‌కే రూ.13.3 లక్షలు !
సాధారణంగా బైక్స్ అంటే ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిల్లో ఈ పిచ్చి ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక కాస్ట్లీ బైక్స్ అంటే అందరూ కొనుక్కోలేకపోయినా కూడా వాటిపైన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేరు. ఈ బైకుల బ్రాండ్స్ లో సుజుకి హయబుసాకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. వేగం, స్టైల్ అన్నీ కలిపిన ప్రతీకగా నిలిచిన హయబుసా బైక్ లకి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా హయబుసా సంస్థ అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఒక మోటార్ ఈవెంట్‌లో బంగారు హయాబుసా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా సుజుకి హయబుసా ధర కొంత ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ బైకును బంగారంతో తయారు చేస్తే.. దాని ధర ఇంకెంత ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బైకును చూసిన వారంతా ధర కొంత ఎక్కువగానే ఉందని భావించినా కానీ అసలు ధర తెలిశాక ఫుల్ షాక్ అవుతున్నారు.

కాగా దీని ధర అక్షరాలా రూ.1.67 కోట్లు అని సమాచారం. ఈ బైకులో చాలా వరకు గోల్డ్ బాడీవర్క్‌ఉండగా.. వజ్రాలను కూడా ఉపయోగించారు. కాగా బోల్టులు కూడా బంగారమే కావడం గమనార్హం. అయితే ఈ బైకుకు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసం మాత్రమే ఏకంగా రూ. 13.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెయింట్ వర్క్ మొత్తాన్ని.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమోటివ్ కళాకారులలో ఒకరైన మిస్టర్ డానీ పూర్తిచేశారని చెబుతున్నారు.
400 హార్స్‌పవర్ ఇంజిన్‌తో ఉన్న ఈ బైక్ ఆటోమొబైల్ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా దీని వెనుక టైరు.. పరిమాణంలో బుగట్టి కారు కంటే పెద్దదిగా ఉన్నట్టు కనబడుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోకు పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications