బ్రాండ్ మార్చిన టాటా కార్స్- న్యూ ఐడెంటిటీ, అద్దిరిపోయే లుక్

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రూటు మార్చింది. తన ప్యాసింజర్ వాహనాల విభాగానికి ఓ నూతన రూపాన్ని అద్దింది. కొనుగోలుదారులకు మరింత చేరువకావడంలో భాగంగా టాటా.కార్స్ (Tata.cars) అనే ఓ అధునాతన బ్రాండింగ్ కస్టమర్ ఫేసింగ్ ఐడెంటిటీని అధికారికంగా ప్రకటించింది. పేరు మార్పు మాత్రమే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి షోరూమ్‌ల వరకు బ్రాండ్ ఇమేజ్‌ను నూతన శకంలోకి తీసుకెళ్లేలా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఈ కంపెనీ విక్రయించే కార్లు, ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు అన్నీ కూడా టాటా. కార్స్ అనే బ్రాండింగ్ కిందకు రానున్నాయి. దీనికి Nothing's Too Far అనే స్లోగన్‌ యాడ్ అయింది. ఇప్పటివరకు టాటా కార్స్ లల్లో వినియోగంలో లేని స్లోగన్ ఇది. సాధారణంగా టాటా వాహనాలన్నింటినీ కూడా టాటా కార్స్ అని పిలవడం పరిపాటే. అదే సెంటిమెంట్‌, జనం నోట సహజంగా వచ్చే ఈ పదాన్నే ఇప్పుడు అధికారిక బ్రాండ్ గా మార్చుకుందా సంస్థ. కంపెనీ అధికారిక లావాదేవీల్లో మాత్రం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ అనేది యధాతథంగా కొనసాగుతుంది.

Tata Motors Unveils TATA CARS Unified Master Brand ICE EV showroom and Future Passenger Mobility

ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ వాహనాలతో పాటు నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్ వాహనాలలో కూడా ఈ సరికొత్త డిజైన్ శైలి అందుబాటులోకి రానుంది. ఈ కొత్త బ్రాండ్ మార్పు పేరుకు మాత్రమే పరిమితం కాలేదు. దీని కోసం Parallel Pathways అనే నూతన విజువల్ డిజైన్ ను సంస్థ యాజమాన్యం రూపొందించింది. టాటా కంపెనీకి చిహ్నమైన 'T' అక్షరం, రోడ్లపై ఉండే వైట్ మార్ రింగ్స్ ఆధారంగా రూపుదిద్దారు.

ఎంత పెరిగిందో.. అంతా తగ్గుతోంది: బంగారం ధరల్లో భారీ పతనం
ఎంత పెరిగిందో.. అంతా తగ్గుతోంది: బంగారం ధరల్లో భారీ పతనం

కస్టమర్లను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌, షోరూమ్‌, సర్వీస్ కేంద్రాలలో ఒకే విధమైన అనుభూతిని కల్పించేందుకు టాటా ఈ బ్రాండింగ్ మార్పునకు తెర తీసింది. ఇందులో భాగంగా టాటా. కార్స్ పేరు బ్యాక్ గ్రౌండ్ లో Ambition Blue అనే ఓ డిఫరెంట్ కలర్ ను వినియోగించింది. ఇదే బ్రాండ్.. దేశంలోని ప్రతి షోరూమ్ లల్లో కనిపించబోతోంది ఇకపై. దేశీయ వాహన పరిశ్రమ రూపురేఖలు వేగంగా మారుతున్న తరుణంలో టాటా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ బ్రాండింగ్ మార్పు.. ఈ తరం కొనుగోలుదారుల కలలు, వారి ఆశయాలను ప్రతిబింబించేలా ఉంటుందని టాటా తెలిపింది. గతంలో నెక్సాన్ ఈవీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని మార్చడం, అలాగే సేఫ్టీకి ప్రాధాన్యతనిచ్చి 5-స్టార్ రేటింగ్ సాధించడం వంటి నిర్ణయాలు తీసుకున్నామని, దీనికి కొనసాగింపుగా బ్రాండింగ్ మార్చినట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+