అమెరికా తాజా నిర్ణయం పట్ల టీసీఎస్ రియాక్షన్: అక్కడ 15,000 రిక్రూట్మెంట్స్

అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం భారత ఐటీ రంగాన్ని, అలాగే అక్కడ పని చేస్తున్న టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలతో పాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పైనా పర్మ్ పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రోగ్రామ్‌ను అమెరికా కార్మిక శాఖ తాత్కాలికంగా నిలిపివేయడం ప్రభావం చూపుతోంది. అనూహ్యంగా దెబ్బకొడుతోంది. దీనివల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశాలపై ఆయా సంస్థలు అంచనా వేస్తోన్నాయి.

దీనిపై తాజాగా టీసీఎస్ స్పందించింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమ వ్యాపార వ్యూహాలపై గానీ, క్లయింట్ సర్వీసులకు గానీ ఎలాంటి అంతరాయం కలగబోదని స్పష్టం చేసింది. అమెరికా కార్మిక శాఖ నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని పేర్కొంది. గత రెండేళ్లలో తమ పర్మ్ దరఖాస్తులు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయని వివరించింది. అమెరికాలో స్థానిక నియామకాలకు తాము ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఈ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపింది.

TCS statement on announcement by US on PERM program says to hire an additional 15000 people in US

ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్‌లో ఈ విషయాన్ని పొందుపరిచింది. పెర్మ్ అందుబాటులో లేకపోయినా అమెరికా కార్యకలాపాలు ఎప్పట్లాగే కొనసాగుతాయని వివరించింది. సంస్థ రోజువారీ కార్యకలాపాలు యధాతథంగా కొనసాగడానికి ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండే నిపుణులను నియమించుకుంటామని, వారిని ప్రోత్సహించడమే తమ ప్రధాన వ్యూహమని స్పష్టం చేసింది టీసీఎస్.

సికింద్రాబాద్ నుంచి ఈ రూట్ లో డైలీ బతుకమ్మ ప్రత్యేక రైళ్లు: ఈ మధ్యాహ్నం నుంచే
సికింద్రాబాద్ నుంచి ఈ రూట్ లో డైలీ బతుకమ్మ ప్రత్యేక రైళ్లు: ఈ మధ్యాహ్నం నుంచే

క్యాంపస్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా ప్రతిభావంతులైన అమెరికన్ యూనివర్శిటీ డిగ్రీ విద్యార్థులను ఎంపిక చేసుకుంటోన్నట్లు వివరించింది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న 31 కార్యాలయాలు, రీజినల్ డెలివరీ సెంటర్లలో మెజారటీ సంఖ్యలో స్థానిక ఉద్యోగులే ఉన్నారని పేర్కొంది. దీన్ని మరింత విస్తరిస్తామని టీసీఎస్ వెల్లడించింది. రానున్న అయిదేళ్లలో అమెరికా స్థానిక నిపుణుల విభాగంలో అదనంగా మరో 15,000 మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్ పునరుద్ఘాటించింది.

తమిళనాడులో అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు: మెజారిటీ మార్క్ కు చేరువగా టీవీకే?
తమిళనాడులో అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు: మెజారిటీ మార్క్ కు చేరువగా టీవీకే?

తమ గ్లోబల్ డెలివరీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి, క్లయింట్ల అవసరాలను తీర్చడానికి ఈ అదనపు నియామకాలు దోహదపడతాయని, విదేశీ వీసాలు, గ్రీన్ కార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చాలా కాలంగా కంపెనీ స్థానిక ఉద్యోగులపైనే ఆధారపడటాన్ని మొదలుపెట్టినట్లు టీసీఎస్ పేర్కొంది.

అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, అడోబ్ గ్రూప్స్ ఇకపై నూతనంగా పెర్మ్ దరఖాస్తులు చేసుకోవడానికి వీలు ఉండదు. దీంతో పాటు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా నిలిచిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+