Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్పీడ్ పెంచిన "టెస్లా".. ఢిల్లీలో రెండో కొత్త షోరూమ్‌ స్టార్ట్ !

అమెరికా విద్యుత్ వాహనాల దిగ్గజం టెస్లా భారతదేశంలో మార్కెట్ పెంచుకుంటుంది. జూలై 15న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మేకర్ మ్యాక్సిటీ మాల్‌లో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కేవలం కొన్ని వారాలకే, ఢిల్లీలోని రెండో షోరూమ్‌ను కూడా ప్రారంభించింది. దీంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

భవిష్యత్ ప్రణాళికలు

రాబోయే నెలల్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లో కొత్త డెలివరీ & ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. స్థానిక తయారీ యూనిట్ స్థాపనపై ప్రభుత్వం & టెస్లా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇది జరిగితే ధరలు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

tesla-launches-second-showroom-in-india-at-delhi

భారత మార్కెట్‌పై ప్రభావం..

అంతే కాకుండా టెస్లా మోడల్ Y లాంఛ్ తో.. విద్యుత్ వాహనాల మార్కెట్‌లో పోటీని మరింత ఉధృతం చేస్తుంది. దేశీయ ఆటోమేకర్లకు ఇది సవాల్ కావచ్చు. అలాగే ప్రీమియం EV కేటగిరీలో వినియోగదారులను విస్తరించనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ప్రారంభోత్సవంతో, టెస్లా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌లో అధికారికంగా అడుగుపెట్టింది. మొదటి దశలోనే, సుమారు రూ.60 లక్షల ప్రారంభ ధరతో మిడ్‌సైజ్ SUV మోడల్ Yని ప్రవేశపెట్టింది. ఈ మోడల్ మొదట ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వేరియంట్లు & ధరలు

  • స్టాండర్డ్ RWD – రూ.60 లక్షలు

  • లాంగ్ రేంజ్ (LR) RWD – రూ.68 లక్షలు(ధరలు ఎక్స్-షోరూమ్, స్థానిక పన్నులు అదనంగా వర్తిస్తాయి)

  • వినియోగదారులు రూ.6 లక్షలు అదనంగా చెల్లించి ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ (FSD) ప్యాకేజీని పొందవచ్చు.

    రంగులు & డిజైన్..

    SUV ఆరు రంగుల్లో లభిస్తుంది — స్టెల్త్ గ్రే ప్రాథమిక ధరలో భాగం కాగా, పెర్ల్ వైట్ మల్టీ-కోట్, డైమండ్ బ్లాక్, అల్ట్రా రెడ్, క్విక్‌సిల్వర్, గ్లేసియర్ బ్లూ కోసం అదనపు ధర చెల్లించాలి. ఇంటీరియర్ బ్లాక్ లేదా వైట్ కలర్‌లో, ఫైవ్-సీటర్ లేఅవుట్‌తో అందించబడుతుంది.

    పర్ఫార్మెన్స్ & టెక్నాలజీ

    • స్టాండర్డ్ RWD – 455 కి.మీ పరిధి

    • LR RWD – 622 కి.మీ పరిధి

    • 0-100 కి.మీ/గం వేగం — 5.6 సెకన్లలో

    • టెస్లా సూపర్‌ఛార్జింగ్ టెక్నాలజీ – 15 నిమిషాల్లో 267 కి.మీ రేంజ్

      కంఫర్ట్ ఫీచర్లు

      • హీటెడ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు

      • పవర్ రీక్లైన్

      • పవర్ ఫోల్డింగ్ & హీటెడ్ రియర్ సీట్లు

      • హ్యాండ్స్-ఫ్రీ పవర్ ట్రంక్

        సేఫ్టీ & ఆటోమేషన్

        ఎనిమిది ఎక్స్టీరియర్ కెమెరాలు, రెండవ తరం కనెక్టివిటీ హార్డ్‌వేర్‌తో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అమర్చబడి ఉంది. మరి టెస్లా బ్రాండ్ అంటే ఇష్టం ఉండే వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+