Bitcoin సృష్టికర్త ఇతడే! చిన్న 'హైఫన్'తో దొరికిపోయాడే..

బిట్‌కాయిన్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని మార్చిన ఒక డిజిటల్ అద్భుతం. దీని వెనుక ఉన్న మేధావి 'సతోషి నకమోటో' ఎవరనేది గత 17 ఏళ్లుగా ప్రపంచానికి ఒక అంతుచిక్కని మిస్టరీ. అయితే, ఏప్రిల్ 2026లో వెలువడిన ఒక సంచలన దర్యాప్తు నివేదిక ఈ రహస్యంపై మునుపెన్నడూ లేని విధంగా కాంతిని ప్రసరింపజేసింది. దాదాపు 1.3 లక్షల ఈమెయిల్‌లు, కోర్టు రికార్డులను జల్లెడ పట్టిన విలేఖరులు.. ఈ రహస్యానికి కేంద్ర బిందువు 55 ఏళ్ల బ్రిటీష్ క్రిప్టోగ్రాఫర్ ఆడమ్ బ్యాక్ అని వేలెత్తి చూపిస్తున్నారు.

బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా వందల మంది పేర్లు వినిపించాయి. కానీ, ప్రముఖ విలేఖరులు జాన్ కారీరౌ, డైలాన్ ఫ్రీడ్‌మాన్ ఒక ఏడాది పాటు సుమారు 1.3 లక్షల ఈమెయిళ్లు, కోర్టు రికార్డులను జల్లెడ పట్టి ఒక పేరును ఖరారు చేశారు. ఆయనే 55 ఏళ్ల బ్రిటీష్ క్రిప్టోగ్రాఫర్ ఆడమ్ బ్యాక్. ఆయనే సతోషి అని చెప్పడానికి వారు బలమైన కారణాలను చూపిస్తున్నారు.

The 17-Year Mystery Ends AI Language Analysis Identifies Adam Back as the Genius Behind Bitcoin s Empire

వ్యాకరణంలో దొరికిపోయిన 'మేధావి'!

ఈ దర్యాప్తులో అత్యంత వింతైన విషయం 'భాషా విశ్లేషణ'. సాధారణంగా మనందరికీ రాసేటప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి. సతోషి రాసిన రాతల్లో కొన్ని అసాధారణమైన తప్పులు (ఉదాహరణకు అనవసరంగా హైఫన్లు వాడటం, 'also' అనే పదంతో వాక్యాన్ని ముగించడం) ఉండేవి. AI సాయంతో 620 మంది నిపుణుల రాతలను పరిశీలించగా.. సతోషి చేసిన 325 హైఫన్ తప్పుల్లో 67 తప్పులు అచ్చం ఆడమ్ బ్యాక్ రాతల్లోనూ కనిపించాయి. ఇది యాదృచ్ఛికం కాదని, అది ఆయన 'భాషా వేలిముద్ర' అని విలేఖరులు తేల్చేశారు.

బిట్‌కాయిన్ కంటే ముందే 'బ్లూ ప్రింట్' రెడీ!

బిట్‌కాయిన్ 2008లో పుట్టింది. కానీ, దానికి కావాల్సిన 'హాష్‌క్యాష్' (Hashcash) అనే టెక్నాలజీని 1997లోనే ఆడమ్ బ్యాక్ కనుగొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 1997 నుండి 1999 మధ్యలోనే బ్యాక్ ఒక డిజిటల్ కరెన్సీకి ఉండాల్సిన ఐదు ప్రధాన లక్షణాలను వివరించారు. సరిగ్గా పదేళ్ల తర్వాత బిట్‌కాయిన్ అవే ఐదు లక్షణాలతో బయటకు వచ్చింది. అంటే బిట్‌కాయిన్ పుట్టక ముందే దాని పునాదిని బ్యాక్ సిద్ధం చేశారన్నమాట.

మాటలో పొరపాటు.. మనసులో ఉన్నది బయటపడిందా?

జనవరి 2026లో ఎల్ సాల్వడార్‌లో జరిగిన ఒక చర్చలో విలేఖరులు ఆడమ్ బ్యాక్‌ను నేరుగా ప్రశ్నించారు. గతంలో సతోషి ఒకచోట "నేను మాటల కంటే కోడింగ్‌లో దిట్టను" అని రాశారు. ఆ మాటను విలేఖరులు గుర్తు చేసినప్పుడు.. బ్యాక్ వెంటనే స్పందిస్తూ "నేను కూడా మాటలతో అంతగా మంచివాడిని కాను" అని బదులిచ్చారు. సతోషి శైలిలోనే ఆయన సమాధానం ఇవ్వడం చూసి, అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇది పొరపాటున ఆయన నోటి నుంచి వచ్చిన నిజామని ఇన్వెస్టిగేటర్లు భావిస్తున్నారు.

ఆ అదృశ్యం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?

2008లో బిట్‌కాయిన్ గురించి నెట్టింట రచ్చ జరుగుతున్నప్పుడు, అంతకుముందు అన్ని చర్చల్లో వేలు పెట్టిన ఆడమ్ బ్యాక్ మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కట్ చేస్తే.. సతోషి 2011 ఏప్రిల్ 26న మాయమైపోయారు. ఆయన అదృశ్యమైన ఆరు వారాల తర్వాతే బ్యాక్ మళ్ళీ బిట్‌కాయిన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే సతోషి వెళ్ళిపోయాకే, బ్యాక్ తన అసలు రూపంలో బయటకు వచ్చారా? అన్న అనుమానం బలపడుతోంది.

9 లక్షల కోట్ల రూపాయల చిక్కు!

సతోషి వద్ద సుమారు 1.1 మిలియన్ బిట్‌కాయిన్‌లు ఉన్నాయని అంచనా. వాటి విలువ మన కరెన్సీలో సుమారు రూ. 9 లక్షల కోట్లు. ప్రస్తుతం ఆడమ్ బ్యాక్ ఒక పెద్ద కంపెనీకి CEOగా ఉన్నారు. ఒకవేళ ఆయనే సతోషి అయితే, అంత పెద్ద ఆస్తి వివరాలను కంపెనీ వాటాదారులకు వెల్లడించాలి. లేదంటే అది చట్టరీత్యా నేరమవుతుంది. ఇప్పుడిది ఆయనకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది.

ఏది ఏమైనా.. సతోషికి సంబంధించిన 'ప్రైవేట్ కీ'తో సంతకం చేసి చూపిస్తే తప్ప ఈ మిస్టరీకి అధికారికంగా తెరపడదు. అప్పటి వరకు ఆడమ్ బ్యాక్ చుట్టూ ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+